జాగ్వార్ నుంచి రానున్న సరికొత్త క్రాసోవర్; పేరు 'ఎఫ్-పేస్'
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న, బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇప్పటి వరకూ జాగ్వార్ బ్రాండ్ క్రింద సెడాన్లను, స్పోర్ట్స్ కార్లను మరియు ల్యాండ్ రోవర్ బ్రాండ్ క్రింది పవర్‌ఫుల్ ఎస్‌యూవీలను తయారు చేస్తూ వస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. జేఎల్ఆర్ తొలిసారిగా తమ సెడాన్ బ్రాండ్ జాగ్వార్ క్రింద ఓ క్రాసోవర్‌ను తయారు చేయనుంది.
వాస్తవానికి జాగ్వార్ ఓ ఎస్‌యూవీని తయారు చేస్తుందని మొదట్లో అందరూ భావించారు. ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ గతంలో ఆవిష్కరించిన 'జాగ్వార్ సి-ఎక్స్17' కాన్సెప్ట్ భవిష్యత్తులో జాగ్వార్ విడుదల చేయనున్న ఎస్‌యూవీని సూచించడమే. అయితే, కంపెనీ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ వాహనాన్ని ఆధారంగా చేసుకొని, ఓ క్రాసోవర్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

ఆసక్తికరమైన విషయం ఏటంటే.. జాగ్వార్ తయారు చేయనున్న ఈ మొట్టమొదటి క్రాసోవర్‌కు 'జాగ్వార్ ఎఫ్-పేస్' (Jaguar F-PACE) అనే పేరును ఖరారు చేశారు. జాగ్వార్ ఎఫ్-పేస్ క్రాసోవర్‌ను కంపెనీ విక్రయిస్తున్న ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేశారు.
ఈ మోడల్ స్టయిల్, పెర్ఫార్మెన్స్ మరియు ప్రాక్టికాలిటీల మధ్య సరైన సమతౌల్యతను ప్రతిభింభింపజేస్తుందని కంపెనీ పేర్కొంది. జాగ్వార్ కొత్త కాంపాక్ట్ సెడాన్ ఎక్స్ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని, ఈ ఎఫ్-పేస్ క్రోసవర్‌ను నిర్మించనున్నారు. ఇది వచ్చే ఏడాది కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








