జాగ్వార్ ఎక్స్ఈ వరల్డ్ ప్రీమియర్ తేది ఖరారు

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ మరో సరికొత్త కారును ప్రపంచానికి పరిచయం చేయనుంది. జాగ్వార్ అభివృద్ధి చేస్తున్న ఎక్స్ఈ మోడల్‌కు వరల్డ్ ప్రీమియర్ డేట్‌ను సెప్టెంబర్ 8, 2014న ఖరారు చేశారు. లండన్‌లో నిర్వహించబోయే ఓ ప్రత్యేక కార్యక్రమంలో జాగ్వార్ ఎక్స్ఈ కారును ఆవిష్కరించనున్నారు.

ఇది కూడా చదవండి: ఫ్యూచర్ కార్లలో స్టీరింగ్ వీల్స్, బ్రేక్స్ ఉండవు!

తమ కొత్త స్పోర్ట్స్ సెలూన్ ఓ నిజమైన డ్రైవర్స్ కార్ అని బ్రిటీష్ కంపెనీ వివరించింది. జాగ్వార్ ఎక్స్ఈతో పాటుగా కంపెనీ ఓ సరికొత్త సిస్టమ్‌ను కూడా పరిచయం చేయనుంది. ఇందులో ఫ్రంట్ సస్పెన్షన్‌ను తమ ఫేమస్ ఎఫ్-టైప్ నుంచి గ్రహించనున్నారు. ఇందులో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్‌ను కూడా పరిచయం చేయనున్నారు.

Jaguar XE

జాగ్వార్ ఈ కారులో సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా 'ఆల్ సర్ఫేస్ ప్రోగ్రామ్ కంట్రోల్' సిస్టమ్‌ను పరిచయం చేయనున్నారు. ప్రతి వాతావరణంలో మరియు ప్రతి టెర్రైన్‌పైనా వెనుక చక్రాల వద్ద ట్రాక్షన్ ఉండేలా ఈ సిస్టమ్ సహకరిస్తుంది. సఫిస్టికేటెడ్ ఛాస్సిస్, అల్యూమినియం ఇంటెన్సివ్ ఆర్కిటెక్చర్‌లను జాగ్వార్ ఎక్స్ఈ లగ్జరీ సెడాన్‌లో ఉపయోగించారు.

ఎక్స్ఈ ఆవిష్కరణతో పాటుగా జాగ్వార్ నాలు కొత్త టెక్నాలజీలను కూడా పరిచయం చేయనుంది. తమ డిజైన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విధానాలకు ఈ కొత్త జాగ్వార్ ఎక్స్ఈ ప్రతీకగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో, జాగ్వార్ తమ కొత్త అల్యూమినియం ఆర్కిటెక్చర్ మరియు కొత్తగా అభివృద్ధి చేసిన డ్రైవర్ ఫీచర్స్ గురించి జాగ్వార్ వివరించనుంది.

ఈ వీడియో చూశారా? వాలెట్ డ్రైవర్ లాంబోర్గినీ కారును ఎలా క్రాష్ చేశాడో..
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/79sFkUi2iAc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Thursday, July 17, 2014, 10:29 [IST]
English summary
Jaguar who is a part of Tata Motors will be having a world premiere on the 8th of September, 2014. They will be unveiling their all new Jaguar XE in London at a star studded event. The British manufacturer explains their new sports saloon vehicle is a true drivers car.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+