ఎంట్రీ లెవల్ జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.0 పెట్రోల్ వెర్షన్ విడుదల
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ భారత మార్కెట్లో అందిస్తున్న జాగ్వార్ ఎక్స్ఎఫ్ సిరీస్ ఓ కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఫోర్డ్ 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో తయారు చేసిన కొత్త 'జాగ్వార్ ఎక్స్ఎఫ్'ను కంపెనీ విడుదల చేసింది. ఇదే ఇంజన్‌ను జాగ్వార్ ఎక్స్‍జే బేస్ వేరియంట్లో కూడా ఉపయోగిస్తున్నారు.
తాజా వేరియంట్ విడుదలతో, జాగ్వార్ ఎక్స్ఎఫ్ ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్లలో (2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్, 3.0 లీటర్ డీజిల్) లభ్యమవుతుంది. పెర్ఫామెన్స్ వెర్షన్ ఎక్స్ఎఫ్ మరియు ఎక్స్ఎఫ్ఆర్ వేరియంట్లు మాత్రం 5.0 లీటర్ ఇంజన్‌తో లభిస్తాయి.

కాగా.. ఈ కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్ జాగ్వార్ ఎక్స్ఎఫ్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 240 హెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా లీటరుకు 10.8 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.0 కేవలం 7.9 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లు ఉండేలా యాంత్రికంగా నియంత్రించారు. రియర్ వ్యూ కెమెరా, మూన్‌రూఫ్, నావిగేషన్ సిస్టమ్, టివి ట్యూనర్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, పెడస్ట్రైన్ కాంటాక్ట్ సెన్సింగ్ ఫీచర్‌లను ఆఫర్ చేస్తుంది.

ఈ కొత్త జాగ్వార్ ఎక్స్ఎఫ్ వేరియంట్‌ను మహారాష్ట్రలోని చిక్లీ ప్లాంటులో ఇతర ఎక్స్ఎఫ్ వేరియంట్లతో పాటుగానే స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తున్నారు. దేశీయ విపణిలో దీని ధర రూ.48.3 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. దేశవ్యాప్తంగా 17 నగరాల్లో ఉన్న 19 జాగ్వార్ అవుట్‌లెట్ల ద్వారా ఇది లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








