'జీప్ రెనెగేడ్' కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత్‌కు వస్తుందా..!?
ఇటాలియన్ కార్ బ్రాండ్ ఫియట్‌కు చెందిన ఎస్‌యూవీల తయారీ కంపెనీ 'జీప్' (Jeep) భారత మార్కెట్ కోసం ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. ఇప్పుడు తాజాగా.. జీప్ నుంచి రానున్న ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది.
ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు 'జీప్ రెనెగేడ్' (Jeep Renegade). మార్చ్ 4, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో తొలిసారిగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో, ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ఈ జీప్ రెనెగేడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన ఫొటోలను మరియు వివరాలను లీక్ చేసింది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ఫియట్ తయారు చేయనున్న ఫియట్ 500ఎక్స్ క్రాసోవర్ మరియు ఈ జీప్ రెనెగేడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను ఒకే ప్లాట్‌ఫామ్‍పై తయారు చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ఫియట్-క్రైస్లర్ గ్రూపుకు చెందిన కొత్త 'స్మాల్ వైడ్ ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్'.

జీప్ రెనెగేడ్ ఓ ట్రైల్ రేటెడ్ ఎస్‌యూవీని జలోప్‌నిక్ పేర్కొంది. అంటే దీని అర్థం ఈ వాహనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్-రోడర్ అని.

జీప్ రెనెగేడ్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉండి, కాంపాక్ట్ సైజులో ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. కానీ ఇందులో ట్రేడ్‌మార్క్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, రైజ్డ్ రైడ్ హైట్, ట్విన్ స్కై రూఫ్ వంటి ఫీచర్లు క్లాసిక్ జీప్‌ను తలపిస్తాయి.

జీప్ రెనెగేడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఫియట్ నుంచి గ్రహించిన 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.3 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లతో పాటుగా 0.9 లీటర్ ట్విన్ ఎయిర్ టర్బో పెట్రోల్ ఇంజన్లను కూడా ఉపయోగించవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications








