కొయినిగ్‌సెగ్ వన్:1 - ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన కార్

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ మరియు తాజాగా వచ్చిన హెన్నెస్సీ వెనామ్ జిటి సూపర్‌కార్లను సవాల్ చేసేందుకు మరో సరికొత్త సూపర్‌కారు సిద్ధమైంది. అదే.. 'కొయినిగ్‌‌సెగ్ వన్:1' (Koenigsegg One:1).

స్వీడన్‌కు చెందిన హైపెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ కొయినిగ్‌సెగ్ అమ్ముల పొది నుంచి దూసుకొచ్చిన మరో అస్త్రమే ఈ వన్:1. ఈ కారు పవర్ టూ వెయిట్ రేషియో (పిటిడబ్ల్యూ) 1:1, అందుకే ఈ కారుకు వన్:1 అనే పేరును పెట్టారు.

అంటే ఈ కారు మొత్తం బరువు 1340 కిలోలు, అలాగే దీని ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి 1340 హెచ్‌పిలు. ఈ రెండింటి నిష్పత్తి 1:1 కాబట్టి ఈ కారుకు వన్:1 అనే పేరును పెట్టినట్లు కొయినిగ్‌సెగ్ పేర్కొంది.

కొయినిగ్‌సెగ్ వన్:1 సూపర్‌కారు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు, టాప్ స్పీడ్ మొదలైన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కొయినిగ్‌సెగ్ వన్:1

కొయినిగ్‌సెగ్ అగెరా సూపర్‌కారులో ఉపయోగించిన ఇంజన్‌నే (5.0 లీటర్ వి8 టర్బో ఇంజన్) ఈ కొత్త వన్:1 సూపర్‌కారులోను ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్‌ను అప్‌ట్యూన్ చేశారు.

కొయినిగ్‌సెగ్ వన్:1

కొయినిగ్‌సెగ్ తమ వన్:1 కారును ప్రపంచంలో కెల్లా తొలి ప్రొడక్షన్ 'మెగావాట్' కారుగా పిలుస్తోంది. ఇందుకు కారణందా, ఇది 1000 కిలోవాట్ల (1340 హార్స్ పవర్) శక్తిని ఉత్పత్తి చేయటమే.

కొయినిగ్‌సెగ్ వన్:1

కొయినిగ్‌సెగ్ వన్:1 యాక్టివ్ ఏరో (పెద్దా హైడ్రాలిక్ రియర్ వింగ్‌తో కలిపి) డైనమిక్స్‌ను కలిగి ఉండి ఫెరారీ లాఫెరారీ, మెక్‌‌లారెన్ పి1 కన్నా ఎన్నో రెట్లు మెరుగైన ట్రాక్ పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కారు గంటకు 257 కి.మీ. వేగం వద్ద 600 కేజీల డౌన్‌ఫోర్స్‌ను జనరేట్ చేస్తుంది.

కొయినిగ్‌సెగ్ వన్:1

కొయినిగ్‌సెగ్ వన్:1 గరిష్ట వేగం గంటకు 273 మైళ్లు (అంటే గంటకు 440 కిలోమీటర్లు). ఇది అధికారికంగా రికార్డు అయితే, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ప్రొడక్షన్ వెర్షన్ కారుగా కొయినిగ్‌సెగ్ వన్:1 రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఈ రికార్డును బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ కలిగి ఉంది.

కొయినిగ్‌సెగ్ వన్:1

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మాదిరిగా కొయినిగ్‌సెగ్ వన్:1 కూడా యాక్టివ్ క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సస్పెన్షన్ సర్దుబాటు చేసుకోవచ్చు. ఇందులో కార్బన్ ఫైబర్ స్పోర్ట్ సీట్లు కూడా మెమరీ ఫోమ్‌ను కలిగి ఉంటాయి.

కొయినిగ్‌సెగ్ వన్:1

కేవలం ఆరు కొయినిగ్‌సెగ్ వన్:1 కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు మరియు దీని ధర 20 లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Saturday, March 1, 2014, 14:33 [IST]
English summary
Koenigsegg One:1 is named so because it has a power to weight ratio of 1:1. That means the 1,340 HP developed by the engine has to pull a car also weighing 1,340 kilograms. And that's with all the fluids and even an average sized driver accounted for.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+