ఢిల్లీలో రెండవ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లాంబోర్గినీ
ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ భారత మార్కెట్లో తమ నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరించుకుంటోది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత్‌లో తమ రెండవ షోరూమ్ ప్రారంభించిన (ముంబైలో) లాంబోర్గినీ తాజాగా ఢిల్లీతో మరో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ఢీల్లీలో ఇది లాంబోర్గీనీకి రెండవ షోరూమ్. తాజా షోరూమ్ ఏర్పాటుతో భారత మార్కెట్లో లాంబోర్గినీ షోరూమ్‌ల సంఖ్య మూడుకు చేరుకుంది.
ఢీల్లీలో కొత్త లాంబోర్గినీ షోరూమ్‌ను ఆటోమొబిలి లాంబోర్గినీ స్పా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ శ్రీ. స్టీఫెన్ వికెల్‌మ్యాన్ ప్రారంభించారు. 4,000 చ.అ. విస్తీర్ణంలో ఈ షోరూమ్ కేవలం 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేశారు. ఇది ఢిల్లీలోని ముథుర రోడ్ వద్ద ఉంది. ఇటాలియన్ సూపర్‌కార్ బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్లుగా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు.
మరిన్ని ఫొటోలు, వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టార్గెట్ యూత్
భారతదేశంలో సంపన్న కుటుంబాలకు చెందిన యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తమ సరికొత్త సూపర్‌కార్లను భారత్ తీసుకురానున్నాంని కంపెనీ పేర్కొంది. రానున్న కొన్నేళ్ల కాలంలోనే తమ కార్ల అమ్మకాలను రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని ఆటోమొబిలి లంబార్గినీ స్పా ప్రెసిడెంట్, సీఈఓ స్టీఫెన్ వింకెల్‌మ్యాన్ తెలిపారు.

బెంగుళూరులో కూడా..
గడచిన సోమవారం న్యూఢిల్లీలో రెండవ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లాంబోర్గనీ, త్వరలోనే బెంగళూరులో కూడా ఒక డీలర్‌షిప్‌ను ప్రారంభించే దిశగా స్థానిక భాగస్వాములతో చర్చలు సాగిస్తోంది. మంతనాలు సాగిస్తోంది.

సేల్స్ టార్గెట్
రానున్న సంవత్సరాల్లో భారత మార్కెట్లో కనీసం 30-40 కార్లను విక్రయిస్తామని, ఈ ఏడాదిలోనే 20కి పైగా కార్లను విక్రయించాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆటోమొబిలి లంబార్గినీ స్పా ప్రెసిడెంట్, సీఈఓ స్టీఫెన్ వింకెల్‌మ్యాన్ చెప్పారు. గడచిన సంవత్సరంలో లాంబోర్గినీ 17 కార్లను విక్రయించింది.

భారత్‌లో లభిస్తున్న మోడళ్లు
ప్రస్తుతం లాంబోర్గినీ దేశీయ విపణిలో లాంబోర్గినీ గల్లార్డో, లాంబోర్గినీ అవంటేడర్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ రెండు మోడళ్లను పూర్తిగా విదేశాల్లో తయారైనవే. వీటిని ఇండియాకు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో విక్రయిచడం జరుగుతుంది. భారత్‌లో ఈ కార్ల ధరల శ్రేణి రూ.2.8 కోట్ల నుంచి రూ.6.30 కోట్ల వరకు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








