లాంబోర్గినీ సెల్ఫిష్ కార్ 'ఇగోయిస్టా' - ఫొటోలు, వివరాలు
ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గనీ, తమ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇటలీలో మొత్తం 350 లాంబోర్గినీ సూపర్ కార్లతో వారం రోజుల పాటు ర్యాలీని నిర్వహించి, ఈ ర్యాలీ ముగింపు తర్వాత తమ వార్షికోత్సవ వేడుకలను ముగింపు సూచకంగా కంపెనీ ఓ అద్భుతమైన కారును ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ వేడుకల ముగింపు సందర్భంగా లాంబోర్గినీ సంస్థ అధినేత స్టీఫెన్ వింకెల్‌మాన్ అధునాతన సింగిల్ సీటర్ 'లాంబోర్గినీ ఇగోయిస్టా' (Lamborghini Egoista) కారు పరదాలను తొలగించారు.
లాంబోర్గినీ ఇగోయిస్టా సూపర్ కారును ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ డిజైన్ హెడ్ వాల్టర్ డి సిల్వా డిజైన్ చేశారు. అపాచే హెలికాఫ్టర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కారును డిజైన్ చేశామని ఆయన తెలిపారు. ఈ కారులోని ప్రవేశించాలంటే అద్దంలా ఉండే విండ్‌షీల్డ్‌ను పైకి లేపాల్సి ఉంటుంది. ఈ కారు బరువును తేలికగా ఉంచేందుకు గాను దీని నిర్మాణంలో అధిక మొత్తంలో కార్బన్ ఫైబర్ పదార్థాన్ని ఉపయోగించారు. ఇందులో శక్తివంతమైన 5.2 లీటర్ వి-10 ఇంజన్‌ను అమర్చారు.
ఈ కారును ఒక వ్యక్తి (సింగిల్ పర్సన్) కోసం మాత్రమే తయారు చేశామని, ప్రపంచంలో కెల్లా అత్యంత అరుదైన, విశిష్టమైన కారును కోరుకునే వారి కోసం ఇగోయిస్టాను రూపొందగించామని, ఇగోయిస్టా అంటే 'స్వార్థం' (సెల్ఫిష్) అని అర్థమని, ఈ కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది కాబట్టి ఈ కారుకు ఆ పేరును పెట్టామని వాల్టర్ డి సిల్వా వివరించారు. సిల్వర్ కరల్ ఎక్స్టీరియర్స్, ఆరెంజ్ కలర్ ఇంటీరియర్స్, 5-స్పోక్ ఆరెంజ్ కలర్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి ల్యాంప్స్, విశిష్టమైన స్టీరింగ్ వీల్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ లాంబో కారు సొంతం. మరి ఆలస్యమెందుకు ఈ ఇటాలియన్ ముద్దుగుమ్మపై ఓ కన్నేద్దాం రండి..!

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ

లాంబోర్గినీ ఇగోయిస్టా ఆవిష్కరణ



Click it and Unblock the Notifications








