ఫాస్టెస్ట్ లాంబోర్గినీ గల్లార్డో స్క్వాడ్రా కోర్స్ ఆవిష్కరణ

By Ravi

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ అత్యంత వేగవంతంమైన గల్లార్డో కారును ఆవిష్కరించింది. 'లాంబోర్గినీ గల్లార్డో ఎల్‌పి 507-4 స్క్వాడ్రా కోర్స్' (Lamborghini Gallardo LP 570-4 Squadra Corse) పేరుతో కంపెనీ ఓ అధునాత గల్లార్డో సూపర్ కారును అభివృద్ధి చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఈ కారును విడుదల చేయనున్నారు.

లాంబోర్గినీ గల్లార్డో సూపర్ ట్రోఫియో రేస్ కార్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త లాంబోర్గినీ గల్లార్డో స్క్వాడ్రా కోర్స్ సూపర్ కారును తయారు చేశారు. ఈ రేస్ కారులోని స్టయిల్‌ను, పెర్ఫామెన్స్‌ను గల్లార్డో స్క్వాడ్రా కోర్స్ కారులో గమనించవచ్చు. ఈ సూపర్ కారులో 562 బిహెచ్‌పి వి10 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.


లాంబోర్గినీ గల్లార్డో స్క్వాడ్రా కోర్స్ గరిష్ట వేగం గంటకు 321 కిలోమీటర్లు. ఈ కారు బరువును తేలికగా ఉంచేందుకు గాను, దీని నిర్మాణంలో అధిక మోతాదులో కార్బన్ ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించారు. ఫలితంగా ఇది ప్రస్తుత గల్లార్డో కన్నా 70 కేజీల తక్కువ బరువు కలిగి ఉంటుంది. ఈ కారుకు బయటి వైపున డోరుకు క్రింది భాగంలో గ్రీన్, వైట్, రెడ్‌తో కూడిన స్ట్రైప్స్ డిజైన్ ఓ కొత్త స్టయిలింగ్ ఫీచర్.

ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు గ్రే, రెడ్, వైట్ లేదా యల్లో కలర్స్‌లో ఆర్డర్ చేయవచ్చు. అలాగే, కస్టమర్లు కోరుకుంటే, రేసింగ్ సీట్లను లేగా రెగ్యులర్ కంఫర్ట్ సీట్లను కూడా ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. పూర్తిగా ఫేస్‌లిఫ్ట్ చేయబడిన గల్లార్డోను 2014లో ఆవిష్కరించనున్నారు.


లాంబోర్గినీ గల్లార్డో ఎల్‌పి 570-4 స్క్వాడ్రా కోర్స్ పెర్ఫామెన్సన్:
  • 3.4 సెకండ్లలో గంటకు 0-100 కి.మీ. వేగం
  • 10.4 సెకండ్లలో గంటకు 0-200 కి.మీ. వేగం
  • గరిష్ట వేగం గంటకు 320 కి.మీ.
  • పవర్-టూ-వెయిట్ రేషియో - 2.35 కేజీ/హార్స్ పవర్

Lamborghini Gallardo
లాంబోర్గినీ గల్లార్డో ఎల్‌పి 560-4 స్టాండర్డ్ వెర్షన్ పెర్ఫామెన్సన్:
  • 3.7 సెకండ్లలో గంటకు 0-100 కి.మీ. వేగం
  • 11.8 సెకండ్లలో గంటకు 0-200 కి.మీ. వేగం
  • గరిష్ట వేగం గంటకు 325 కి.మీ.
  • పవర్-టూ-వెయిట్ రేషియో - 2.5 కేజీ/హార్స్ పవర్

More from DriveSpark

Article Published On: Friday, August 2, 2013, 9:00 [IST]
English summary
The fastest ever Lamborghini Gallardo is now revealed - the LP 570-4 Squadra Corse is now revealed. It will be officially unveiled at the Frankfurt Motor Show this year! The Lamborghini Squadra Corse is road legal and its performance and styling comes from the Lamborghini Gallardo Super Trofeo race car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+