సెప్టెంబర్ నెలలో లాంబోర్గినీ హారికేన్ ఇండియా లాంచ్
ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఉత్పత్తిని నిలిపివేసిన తమ పాపులర్ గల్లార్డో స్థానాన్ని భర్తీ చేసేందుకు 'లాంబోర్గినీ హారికేన్' (Lamborghini Huracan) సూపర్‌కారు మరికొద్ది నెలల్లోనే ఇండియాకు కూడా రానుంది.
ఈ ఏడాది ద్వితీయార్థం ఆరంభంలో లాంబోర్గినీ హారికేన్ భారత మార్కెట్లో విడుదల కానుందని, దీని డెలివరీలు మాత్రం సెప్టెంబర్ 2014లో ప్రారంభం కానున్నాయని సమాచారం. దేశీయ విపణిలో దీని ధర రూ.3.4 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లాంబోర్గినీ హారికేన్ కోసం 1000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని, అందులో కొన్ని భారతదేశం నుంచి కూడా వచ్చాయని లాంబోర్గినీ ఇండియా ఆపరేషన్స్ హెడ్ పవన్ షెట్టి ఓ ఆంగ్ల పత్రికతో తెలిపారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

లాంబోర్గినీ గల్లార్డో స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 సూపర్ కారు పేరును 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ నుంచి స్ఫూర్తి పొంది పెట్టారు.

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 పేరులో ఎల్‌పి అంటే, 'లాంగిట్యూడినేల్ పోస్టెరీయోర్'. ఇది ఇంజన్ ఓరియంటేషన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇందులో 610 అంటే ఇంజన్ నుంచి వెలవడే శక్తి (పిఎస్‌లలో), 4 అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అని అర్థం.

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ లాంబోర్గినీ డైనమిక్ స్టీరింగ్, మ్యాగ్నెటో-రియోలాజికల్ డ్యాంపర్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి.

లాంబోర్గినీ హారికేన్‌లో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా. ఇందులో కోర్సా మోడ్ అత్యంత శక్తివంతమైనది. దీని పెర్ఫామెన్స్ వివరాలు ఉన్నాయి:
* 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగం
* 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగం
* గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు.

గల్లార్డో ట్రాక్ వెర్షన్ అయిన 'సెస్టో ఎలిమెంటో' (కేవలం రేస్ ట్రాక్‌ల కోసం మాత్రమే తయారు చేయబడినది) నుంచి స్ఫూర్తి పొంది లాంబోర్గినీ హారికేన్‌ను తయారు చేశారు. అవెంటేడర్‌లోని కొన్ని డిజైన్ ఎలిమెంట్లను కూడా ఇందులో కూడా గమనించవచ్చు.

లాంబోర్గినీ హారికేన్ తయారీలో ఎక్కువ భాగం కార్బన్ ఛాస్సిస్‌ను ఉపయోగించడం వలన ఇది లీటరుకు 8 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఇది కిలోమీటరుకు 290 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను విడుదల చేస్తుంది. ఈయూ6 కాలుష్య నిబంధనలను పాటించే ఈ ఇంజన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తుంది.

లాంబోర్గినీ హారికేన్ సూపర్ కారులో 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను జోడించారు. నప్పా లెథర్, ఆల్కాంట్రాలతో దీని అప్‌హోలెస్ట్రీ, ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు.


Click it and Unblock the Notifications








