ఇటాలియన్ పోలీస్ కారుగా మారిన లాంబోర్గినీ హారికేన్
ఇటాలియన్ సూపర్‌కార్ బ్రాండ్ లాంబోర్గినీ తమ స్వదేశ పోలీసు శాఖ కోసం ఇటీవలే విడుదల చేసిన సరికొత్త 'లాంబోర్గినీ హారికేన్' (Lamborghini Huracan) కారును తయారు చేసి ఇచ్చింది. నేరగాళ్ల భరతం పట్టేందుకు ఈ పోలీస్ వెర్షన్ లాంబోర్గినీ హారికేన్ సూపర్‌కారును ఉపయోగించనున్నారు. లైట్ బ్లూ అండ్ వైట్ కలర్ ఎక్స్టీరియర్ థీమ్‌తో పోలీసు శాఖ అవసరాలకు అనుగుణంగా దీనిని కస్టమైజ్ చేశారు. ఇందులో ప్రధానంగా, కారు పైభాగంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి పోలీస్ బీకాన్ లైట్, ప్రత్యేక సైరెన్, వైర్‌లెస్ రేడియో వంటి పలు ఫీచర్లతో దీనిని తయారు చేశారు.
రోమ్‌లోని మ్యూసియో డెల్ ఆటో స్టోరీచ్ డెల్లా పోలిజియా డి స్టాటో వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో లాంబోర్గినీ సీఈఓ స్టీఫెన్ వింకిల్‌మ్యాన్ ఈ సూపర్‌కారు తాళం చెవులను పర్‌ఫెక్ట్ అలెశాండ్రో పాన్సాకి అందజేశారు. 2004 నుంచి 2008 వరకు ఇటలీ పోలీస్ కారుగా సేవలందించిన గల్లార్డో స్థానాన్ని ఈ హారికేన్ రీప్లేస్ చేయనుంది. ఓ ప్రమాదంలో ఈ గల్లార్డో కారు తీవ్రంగా డ్యామేజ్ కావటంతో అది షెడ్డుకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, కొత్త లాంబోర్గినీ హారికేన్ సూపర్‌కారునైన జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరని ఆశిస్తున్నారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

ఇటాలియన్ పోలీస్ వెర్షన్ లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారులో కూడా 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ లాంబోర్గినీ డైనమిక్ స్టీరింగ్, మ్యాగ్నెటో-రియోలాజికల్ డ్యాంపర్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా. ఇందులో కోర్సా మోడ్ అత్యంత శక్తివంతమైనది. దీని పెర్ఫామెన్స్ వివరాలు ఉన్నాయి:
* 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగం
* 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగం
* గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు.

లాంబోర్గినీ హారికేన్ తయారీలో ఎక్కువ భాగం కార్బన్ ఛాస్సిస్‌ను ఉపయోగించడం వలన ఇది లీటరుకు 8 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఇది కిలోమీటరుకు 290 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను విడుదల చేస్తుంది. ఈయూ6 కాలుష్య నిబంధనలను పాటించే ఈ ఇంజన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తుంది.

లాంబోర్గినీ హారికేన్ సూపర్ కారులో 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను జోడించారు. నప్పా లెథర్, ఆల్కాంట్రాలతో దీని అప్‌హోలెస్ట్రీ, ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు. గల్లార్డో ట్రాక్ వెర్షన్ అయిన 'సెస్టో ఎలిమెంటో' (కేవలం రేస్ ట్రాక్‌ల కోసం మాత్రమే తయారు చేయబడినది) నుంచి స్ఫూర్తి పొంది లాంబోర్గినీ హారికేన్‌ను తయారు చేశారు. అవెంటేడర్‌లోని కొన్ని డిజైన్ ఎలిమెంట్లను కూడా ఇందులో కూడా గమనించవచ్చు.

కాగా.. లాంబోర్గినీ హారికేన్ సూపర్‌కారు మరికొద్ది నెలల్లోనే ఇండియాకు కూడా రానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








