లాంబోర్గినీ హురాకన్ విడుదల; ధర రూ.3.43 కోట్లు

By Ravi

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ తమ పాపులర్ గల్లార్డో సూపర్ కారు స్థానాన్ని రీప్లేస్ చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో అందిస్తున్న లేటెస్ట్ సూపర్‌కార్ 'లాంబోర్గినీ హురాకన్' (Lamborghini Huracan)ను కంపెనీ నేడు (సెప్టెంబర్ 22, 2014) భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో లాంబోర్గినీ హురాకన్ ధర రూ.3.43 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

స్టయలింగ్ విషయానికి వస్తే, ముందు వైపు నుంచి ఇది పెద్ద అవెంటేడర్ మాదిరిగా కనిపిస్తుంది. ఫ్రంట్ డిజైన్‌లోని యాంగ్యులర్, షార్ప్ లైన్స్ మరియు పెద్ద ఎయిర్-ఇన్‌టేక్స్ వలన కారు ఏరోడైనమిక్స్ మరింత ఇంప్రూవ్ అయ్యాయి. లాంబోర్గినీ హురాకన్‌‌లోని ఇంటీరియర్స్ జెట్ విమానంలో కాక్‌పిట్‌ను తలపిస్తుంది. డ్రైవర్ యాక్సిస్ కోసం అనేక కంట్రోల్స్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉంటుంది.

లాంబోర్గినీ హురాకన్ కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Lamborghini Huracan

ఈ కారు కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని, 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 325 కిలోమీటర్లు. ఇండియన్ వెర్షన్ హురాకన్‌లో పవర్డ్ సీట్స్, కార్బన్ సెరామిక్ బ్రేక్స్, నోస్ లిఫ్ట్ ఫంక్షన్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి. ఇందులో నోస్ లిఫ్ట్ ఫంక్షన్ చాలా విశిష్టమైన ఫీచర్.

ఈ నోస్ లిఫ్ట్ ఫంక్షన్‌ను ప్రత్యేకించి ఇండియన్ రోడ్లను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు. ఎత్తుగా ఉండే స్పీడ్ బ్రేకర్లను లో గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన హురాకన్ దాటడం కష్టం కాబట్టి, ఈ నోస్ లిఫ్ట్ ఫంక్షన్‌ను స్టార్ట్ చేసినట్లయితే, కారు ముందు భాగం కాస్తంత పైకి లేస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ లాంబోర్గినీ డైనమిక్ స్టీరింగ్, మ్యాగ్నెటో-రియోలాజికల్ డ్యాంపర్స్ వంటి ఫీచర్లున్నాయి.

లాంబోర్గిని హురాకన్‌‌ను 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ (దున్నపోతు) నుంచి స్ఫూర్తి పొంది ఈ పేరును పెట్టడం జరిగింది. 'లాంబోర్గినీ హురాకన్ ఎల్‌పి 640-4' పేరులో ఎల్‌పి అంటే, 'లాంగిట్యూడినేల్ పోస్టెరీయోర్'. ఇది ఇంజన్ ఓరియంటేషన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇందులో 610 అంటే ఇంజన్ నుంచి వెలవడే శక్తి (పిఎస్‌లలో), 4 అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అని అర్థం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, September 22, 2014, 15:01 [IST]
English summary
The Italian automobile manufacturer Lamborghini has launched the Huracan in India at Rs 3.43 crore (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+