భారత్‌కు రానున్న లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్ (టాప్‌లెస్)
ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లను తయారు చేసే, ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ తాజాగా ఆవిష్కరించిన ఓపెన్ టాప్ వెర్షన్ 'లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్'ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ టాప్‌లెస్ లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారు జనవరి 25న దేశీయ విపణిలో విడుదల కానుంది. లాంబోర్గినీ తొలిసారిగా ఈ సూపర్ కారును గడచిన సంవత్సరంలో జరిగిన 2012 లాస్ ఏంజిల్స్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.
ఈ టాప్‌లెస్ వెర్షన్ అవెంటేడర్ రోడ్‌స్టర్ పైభాగాన్ని (రూఫ్)ను అవసరం లేదనుకున్నప్పుడు తొలగించుకొని ఓపెన్ టాప్ కన్వర్టిబల్ కారుగా మార్చుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ కారు రూఫ్ రెండు భాగాలుగా విడిపోతుంది. దీనికి తొలగించి కారు లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో దాచుకోవచ్చు. ఈ రూఫ్‌ను కార్బన్ ఫైబర్ పదార్థంతో తయారు చేశారు. లాంబోర్గినీ పేటెంట్ చేసిన ఫోర్జ్‌డ్ కాంపోసిట్, ఆర్‌టిఎమ్ టెక్నాలజీలను ఉపయోగించి అభివృద్ధి చేశారు.
లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్‌లో ఉపయోగించిన శక్తివంతమైన 6.5 లీటర్, వి12 ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 700 హెచ్‌పిల శక్తిని, 690 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇది కేవలం మూడు సెకండ్లలోనే మూడంకెల వేగాన్ని (2.9 సెకండ్లలోనే 0-100 కి.మీ.) అందుకుంటుంది. అధిక వేగంతో ప్రయాణించేందుకు గానూ ఈ కారు బాడీని ముందు, వెనుక వైపు అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన కార్బన్ ఫైబర్ మోనోకాక్ (సింగిల్) షాషీని ఉపయోగించారు.

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్
ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్ కారు 7-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఏడు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది. రెండు డోర్లు మాత్రమే కలిగిన ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది సిజర్ డోర్స్‌ను (కత్తెర మాదిరిగా పైవైపుకు తెరచుకునే డోర్లు) కలిగి ఉంటుంది. ఓపెన్ టాప్ వెర్షన్ లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్ ధర యూరోలు 300,000 (మన దేశ కరెన్సీలో సుమారు రూ. 2.15 కోట్లు) (పన్నులు కలుపుకోకుండా). లాంబోర్గీనీ ముర్సిలాగో స్థానాన్ని ఈ కొత్త మోడల్ భర్తీ చేయనుంది.
లాంబోర్గినీకు ఇండియాలో రెండు డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. అందులో ఒకటి ఢిల్లీకు చెందిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ కాగా మరొకటి ముంబైకు చెందిన ఆటోహ్యాంగర్. ప్రస్తుతం లాంబోర్గినీ దేశీయ విపణిలో లాంబోర్గినీ గల్లార్డో, లాంబోర్గినీ అవంటేడర్ మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ రెండు మోడళ్లను పూర్తిగా విదేశాల్లో తయారైనవి. వీటిని ఇండియాకు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో విక్రయిచడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








