భారత్‌లో అవెంటేడర్ రోడ్‌స్టర్‌ను విడుదల చేసిన లాంబోర్గినీ

మెరుపు వేగంతో దూసుకుపోగల కార్లను తయారు చేసే ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ తమ టాప్‌లెస్ అవెంటేడర్ రోడ్‌స్టర్‌ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. లాంబోర్గినీ నుంచి లభిస్తున్న అత్యంత పాపులర్ అయిన అవెంటేడర్ సిరీస్‌లో ఓపెన్ టాప్ వెర్షన్ కోరుకునే లగ్జరీ కార్ ప్రియుల కోసం కంపెనీ అభివృద్ధి చేసిన 'లాంబోర్గినీ అవెంటేడర్‌ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్'ను రూ.4.77 కోట్ల ధరతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) దేశీయ మార్కెట్లో విడుదలయింది.

ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే, ఈ మొత్తానికి వివిధ పన్నులు కలుపుకుంటే దీని సుమారు రూ.5 కోట్లకు పైమాటే. ఈ ఓపెన్ టాప్ వెర్షన్ లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్‌ను కంపెనీ తొలిసారిగా గడచిన సంవత్సరంలో జరిగిన 2012 లాస్ ఏంజిల్స్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ టాప్‌లెస్ వెర్షన్ అవెంటేడర్ రోడ్‌స్టర్ పైభాగాన్ని (రూఫ్)ను అవసరం లేదనుకున్నప్పుడు తొలగించుకొని ఓపెన్ టాప్ కన్వర్టిబల్ కారుగా మార్చుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ కారు రూఫ్ రెండు భాగాలుగా విడిపోతుంది. దీనికి తొలగించి కారు లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో దాచుకోవచ్చు. ఈ రూఫ్‌ను కార్బన్ ఫైబర్ పదార్థంతో తయారు చేశారు.

లాంబోర్గినీ అవెంటేడర్‌ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్‌లో ఉపయోగించిన శక్తివంతమైన 6.5 లీటర్, వి12 ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 700 హెచ్‌పిల శక్తిని, 690 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇది కేవలం మూడు సెకండ్లలోనే మూడంకెల వేగాన్ని (2.9 సెకండ్లలోనే 0-100 కి.మీ.) అందుకుంటుంది. అధిక వేగంతో ప్రయాణించేందుకు గానూ ఈ కారు బాడీని ముందు, వెనుక వైపు అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన కార్బన్ ఫైబర్ మోనోకాక్ (సింగిల్) షాషీని ఉపయోగించారు.

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్

లాంబోర్గినీ అవెంటేడర్ రోడ్‌స్టర్


ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్‌ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్‌ కారు 7-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఏడు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది. రెండు డోర్లు మాత్రమే కలిగిన ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది సిజర్ డోర్స్‌ను (కత్తెర మాదిరిగా పైవైపుకు తెరచుకునే డోర్లు) కలిగి ఉంటుంది. లాంబోర్గినీకు ఇండియాలో రెండు డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. అందులో ఒకటి ఢిల్లీకు చెందిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ కాగా మరొకటి ముంబైకు చెందిన ఆటోహ్యాంగర్. ఈ రెండు డీలర్‌షిప్ కేంద్రాల్లో అవెంటేడర్ రోడ్‌స్టర్ లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 25, 2013, 15:29 [IST]
English summary
Italian super car manufacturer Lamborghini has launched its latest supercar Aventador Roadster in India. The Lamborghini Aventador Roadster is priced at INR 4.77 Crores ex-showroom Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+