లాంబోర్గినీ హారికేన్: విడుదలకు ముందే 700 బుకింగ్స్!

సాధారణంగా కోట్ల రూపాయలు ఖరీదు చేసే సూపర్‌కార్లు నెలకు 20 యూనిట్లు అమ్ముడుపోవటమంటేనే గొప్ప విషయం అలాంటిది ఏకంగా 700 సూపర్‌కార్లు అమ్ముడుపోతే..? ఆశ్చర్యంగా ఉంది కదూ..! వివాల్లోకి వెళ్తే..

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ గడచిన డిసెంబర్ నెలలో ఉత్పత్తిని నిలిపివేసిన తమ పాపులర్ గల్లార్డో స్థానాన్ని రీప్లేస్ చేస్తూ 'హారికేన్' అనే పేరుతో ఆవిష్కరించిన సరికొత్త సూపర్‌కారు విడుదలకే ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

లాంబోర్గినీ హారికేన్ సూపర్‌కారుకు ఇప్పటికే 700 బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 సూపర్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

లాంబోర్గినీ హారికేన్

గల్లార్డోకి సక్సెసర్‌గా వస్తున్న ఈ సూపర్ కారు పేరు లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4. ఈ కారుకు ఆ పేరును 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ నుంచి స్ఫూర్తి పొంది పెట్టడం జరిగింది.

లాంబోర్గినీ హారికేన్

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 పేరులో ఎల్‌పి అంటే, 'లాంగిట్యూడినేల్ పోస్టెరీయోర్'. ఇది ఇంజన్ ఓరియంటేషన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇందులో 610 అంటే ఇంజన్ నుంచి వెలవడే శక్తి (పిఎస్‌లలో), 4 అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అని అర్థం.

లాంబోర్గినీ హారికేన్

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లాంబోర్గినీ హారికేన్

ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ లాంబోర్గినీ డైనమిక్ స్టీరింగ్, మ్యాగ్నెటో-రియోలాజికల్ డ్యాంపర్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి.

లాంబోర్గినీ హారికేన్

లాంబోర్గినీ హారికేన్‌లో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా. ఇందులో కోర్సా మోడ్ అత్యంత శక్తివంతమైనది. దీని పెర్ఫామెన్స్ వివరాలు ఉన్నాయి:

* 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగం

* 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగం

* గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు.

లాంబోర్గినీ హారికేన్

గల్లార్డో ట్రాక్ వెర్షన్ అయిన 'సెస్టో ఎలిమెంటో' (కేవలం రేస్ ట్రాక్‌ల కోసం మాత్రమే తయారు చేయబడినది) నుంచి స్ఫూర్తి పొంది లాంబోర్గినీ హారికేన్‌ను తయారు చేశారు. అవెంటేడర్‌లోని కొన్ని డిజైన్ ఎలిమెంట్లను కూడా ఇందులో కూడా గమనించవచ్చు.

లాంబోర్గినీ హారికేన్

లాంబోర్గినీ హారికేన్ తయారీలో ఎక్కువ భాగం కార్బన్ ఛాస్సిస్‌ను ఉపయోగించడం వలన ఇది లీటరుకు 8 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఇది కిలోమీటరుకు 290 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను విడుదల చేస్తుంది. ఈయూ6 కాలుష్య నిబంధనలను పాటించే ఈ ఇంజన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తుంది.

లాంబోర్గినీ హారికేన్

లాంబోర్గినీ హారికేన్ సూపర్ కారులో 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను జోడించారు. నప్పా లెథర్, ఆల్కాంట్రాలతో దీని అప్‌హెలెస్ట్రీ, ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు.

లాంబోర్గినీ హారికేన్

వచ్చే ఏడాది మార్చ్ నెలలో జరగనున్న 2014 జెనీవా మోటార్ షోలో లాంబోర్గినీ హారికేన్‌ను విడుదల చేయనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, February 13, 2014, 15:33 [IST]
English summary
The most successful car in Lamborghini history was their iconic Gallardo. However, the Italian outfit received a pleasant surprise in the form that the Huracan too is doing good. Lamborghini reports that they have 700 booking already for their Sports car, within a month's time.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+