నకిలీ లాంబోర్గినీ బాడీ కిట్ల తయారీ కేసులో 'కార్ కిట్'
మనలో చాలా మందికి లాంబోర్గినీ సూపర్ కారులో తిరగాలనే కోరిక ఉంటుంది. కానీ, ఆ కారును కొనుగోలు చేసేంత డబ్బు మాత్రం మన వద్ద ఉండకపోవచ్చు. కోట్ల ఖరీదు చేసే లాంబోర్గినీ కార్లను సొంతం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అయితే, లాంబోర్గినీ కారును కొనుక్కునే స్థోమత లేనివారు అచ్చుగుద్దినట్లు టాప్ టూ బాటమ్ లాంబోర్గినీలా ఉండే డూప్లికేట్ కారును కొనుగోలు చేస్తే పోలా..!
ఇదే ఐడియా కార్ కిట్ అనే కంపెనీకు వచ్చింది. అమెరికాలోని అలబామాకు చెందిన కార్ కిట్ ఐఎన్‌సి కంపెనీ అన్ని రకాల లాంబోర్గినీ కార్లకు డూప్లికే పార్ట్‌లవను తయారు చేసి, పాత డొక్కు కార్లను అచ్చుగుద్దినట్లు లాంబోర్గినీ కార్ల మాదిరిగా కస్టమైజ్ చేసేస్తోంది. ఈ కంపెనీ కస్టమైజ్ చేసిన డూప్లికేట్ లాంబోర్గినీ కార్లను, ఒరిజినల్ లాంబోర్గినీ కార్లను పక్క పక్కన పెట్టి చూస్తే, చిన్న తేడా కూడా కనిపించనంతగా మార్చేస్తారు ఈ జాదుగాళ్లు.
రూ.4 లక్షల కారును సైతం రూ.4 కోట్ల కారుగా మార్చేయటంలో వీళ్లు చాలా ముదుర్లు. టొయోటా ఎమ్ఆర్2, పోర్షే బాక్స్టర్, డాడ్జ్ నియో సేజా పాంటియాక్ ఫీరో వంటి కార్లను వారు తయారు చేసే డూప్లికేట్ లాంబోర్గినీ కిట్లతో ఈ కార్లను లాంబోర్గినీ సూపర్ కార్లుగా మార్చేస్తారు. అయితే, ప్రస్తుతం ఈ కార్ కిట్ ఐఎన్‌సీ న్యాయపరమైన చిక్కులో పడింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఇటాలియన్ కార్ మేకర్ లాంబోర్గీనీ తమ ఉత్పత్తులకు నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్న కార్ కిట్ ఐఎన్‌సిపై కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఈ విషయంపై కార్ కిట్ కంపెనీ అధినేత జాకీ జాన్సర్ మాట్లాడుతూ, తాను రూపొందించే కార్లు కేవలం సరదా కోసం మాత్రమేమని, లాంబోర్గినీ దీనిని సీరియస్‌గా తీసుకుందని అన్నారు. చైన్ రంపంను ఉపయోగించి లాంబోర్గినీ కిట్ మోల్డ్‌లను ధ్వంసం చేసే వీడియో టేప్‌ను ఆయన లాంబోర్గినీకి పంపించాడు. సరే వీరి వివాదం పక్కన ఉంచితే, ఈ డూప్లికేట్ కార్లపై మనం కూడా ఓ కన్నేసొద్దాం రండి..!

ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు, ఇటలీకు చెందిన ప్రముఖ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ అందిస్తున్న కారును డూప్లికేట్ చేసి కార్ కిట్ ఐఎన్‌సి రూపొందించినది.

లాంబోర్గినీ కిట్లను డూప్లికేట్ చేసేందుకు జాకీ జాన్సర్ మరియు అతని బృందం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఫైబర్ గ్లాస్ మోల్డ్‌లను ఉపయోగిస్తారు.

ఇదిగో ఇది పూర్తిగా తయారైన డూప్లికేట్ లాంబోర్గినీ డియాబ్లో. ఈ బాడీ కిట్ల ధర 1000 డాలర్ల నుంచి 5000 డాలర్ల రేంజ్‌లో ఉంటుంది. అదే నిజమైన లాంబోర్గినీ డియాబ్లో కారును కొనుగోలు చేయాలంటే 2,40,000 డాలర్ల నుంచి 2,50,000 డాలర్లు ఖర్చు చేయాలి. 1991 లాంబోర్గినీ డియాబ్లో అప్పట్లో ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు.

ఇది రియల్ లాంబోర్గినీలా కనిపిస్తుందా..? కార్ కిట్ ఐఎన్‌సి కేవలం ఫైబర్ గ్లాస్ బాడీ కిట్లను మాత్రమే అందిస్తుంది. బయ్యరే ఈ కిట్లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బాడీ కిట్లను ఇన్‌స్టాల్ చేయటానికి కనీసం 4-5 వారాల సమయం పడుతుంది. లాంబోర్గినీ కిట్లతో పాటుగా బెంట్లీ, ఫెరారీ కిట్లను తయారు చేయటంలో కార్ కిట్ ఐఎన్‌సి చేయి తిరిగి ఉంది.

పూర్తిగా ఫినిష్ అయిన లాంబోర్గినీ ముర్సిలాగోను చూడండి.

లాంబోర్గినీ డియాబ్లో రోడ్‌స్టర్ రెప్లికా.



Click it and Unblock the Notifications








