స్లోవేకియాలో లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీ ఉత్పత్తి!

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ మొట్టమొదటి సారిగా అభివృద్ధి చేసిన 'లాంబోర్గినీ యూరస్' (Lamborghini Urus) ఎస్‌యూవీని స్లోవేకియాలోని ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. లాంబోర్గినీ తమ యూరస్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2012లో చైనాలో జరిగిన బీజింగ్ ఆటో షోలో, ఆ తర్వాత అనేక మోటార్ షోలలో ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసినదే.

ఉత్పత్తికి సిద్ధంగా ఉండే ఈ పవర్‌ఫుల్, స్టయిలిష్ లాంబోర్గినీ యూరస్ ఎస్‌యూవీని 2017 నాటికి రోడ్లపై చూస్తామని గతంలో లాంబోర్గినీ సీఈఓ స్టీఫెన్ వింకిల్‌మ్యాన్ కూడా ప్రకటించిన విషయం విదితమే. స్లోవేకియాలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన ఈ ఉత్పత్తి కేంద్రంలో ఇప్పటికే ఆడి క్యూ7, ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ వంటి వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి.


ఈ నేపథ్యంలో, లాంబోర్గినీ తమ యూరస్ ఉత్పత్తిని 2014లో స్లోవేకియాలోని బ్రాటిస్లావా ప్లాంట్‌లో ప్రారంభించనుంది. సాధారణంగా, లాంబోర్గినీ తమ సూపర్ కార్లను శాంటాఅగటా ప్లాంటులో తయారు చేస్తుంది. అలాగే, తమ లేటెస్ట్ హారికేన్ మరియు అవెంటేడర్‌లను మాత్రం ఇటలీలోనే తయారు చేస్తోంది. యూరస్‌ను మాత్రమే స్లోవేకియాలో తయారు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

సాలిడ్ బాడీ, స్టన్నింగ్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ మేకర్ డిజైన్ చేసిన ఈ కాంపాక్ట్ సూపర్ స్టైలిష్ ఎస్‌యూవీలో గరిష్టంగా 600 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 180 మైళ్ల వేగం (అంటే గంటకు 289.68 కి.మీ. వేగం)తో పరుగులు తీస్తుంది.

Lamborghini Urus SUV To Be Built In Slovakia

లాంబోర్గినీ యూరస్ కేవలం 5.4 అడుగుల ఎత్తును, 6.5 అడుగుల వెడల్పును, 16.4 అడుగుల పొడవును కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని తేలికగా ఉంచేందుకు గానూ దీని తయారీలో కార్బన్ ఫైబర్ రీఫైన్డ్ పాలిమర్‌ను ఉపయోగించారు (అందుకే అంత వేగం). యూరస్ ఎస్‌యూవీని ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌‌తో రూపొందించారు.

More from DriveSpark

Article Published On: Monday, April 28, 2014, 9:11 [IST]
English summary
Lamborghini has showcased their concept SUV, the Urus many times at various motor shows. They have finally confirmed that they will manufacture this uber-luxurious SUV. The Italian iconic manufacturer suggests their SUV should be ready for 2017.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+