అత్యంత వేగంగా పరుగులు పెట్టే 'లాంబోర్గినీ వెనెనో'
ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ తన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఓ సరికొత్త సూపర్ కారును జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించింది. 'లాంబోర్గినీ వెనెనో ఎల్‌పి 750-4' అనే ఓ లిమిటెడ్ ఎడిషన్ కారును లాంబోర్గినీ విడుదల చేసింది. ఇలాంటివి కేవలం మూడు కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేయనుంది. దీని 30 లక్షల యూరోలు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.21.4 కోట్లకు పైమాటే (అదీ పన్నులు కలుపుకోకుండా).
లాంబోర్గనీ నుండి లభిస్తున్న కార్లలో కెల్లా ఇది అత్యంత వేగంగా పరుగులు పెట్టనుంది. 20వ శతాబ్ధానికి చెందిన ఫైటింగ్ బుల్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కారుకు వెనెనో అనే పేరును పెట్టారు. ఈ కారును లాంబోర్గినీ అవెంటేడర్ మోడల్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. దీని ఛాస్సిస్, బాడీలను కార్బనే ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ (సిఎఫ్ఆర్‌పి)లతో తయారు చేశారు. ఇందులో శక్తివంతమైన 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు (అవెంటేడర్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు).
అయితే, ఈ ఇంజన్‌ను కొద్దిగా రీట్యూన్ చేశారు. ఇది గరిష్టంగా 750 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి అవెంటేడర్‌లో ఉపయోగించిన ఇంజన్ కన్నా 50 పిఎస్‌లు అధికం. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ రోబోటైజ్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మరి ఈ లాంబోర్గినీ లేటెస్ట్ బ్యూటీపై ఓ కన్నేయండి..!

లాంబోర్గినీ వెనెవో

లాంబోర్గినీ వెనెవో

లాంబోర్గినీ వెనెవో

లాంబోర్గినీ వెనెవో

లాంబోర్గినీ వెనెవో

లాంబోర్గినీ వెనెవో

లాంబోర్గినీ వెనెవో

లాంబోర్గినీ వెనెవో

లాంబోర్గినీ వెనెవో



Click it and Unblock the Notifications








