లాంబోర్గినీ వెనెనో హైపర్ కారుకు నో స్టాక్ బోర్డ్!

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ లాంబోర్గినీ జరిగిన 2013 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించిన లిమిటెడ్ ఎడిషన్ లాంబోర్గినీ వెనెనో సూపర్ కార్ల అప్పుడే అమ్ముడుపోయాయి. లాంబోర్గినీ తమ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది మార్చి నెలలో వెనెనో సూపర్ కారును చిత్రాల రూపం తొలిసారిగా ఆవిష్కరించింది. ఆ తర్వాత జెనీవా మోటార్ షోలో ఒరిజినల్ వెనెనో మీడియాకు ప్రదర్శించింది.

ఈ షోలో 'లాంబోర్గినీ వెనెనో ఎల్‌పి 750-4' అనే ఓ లిమిటెడ్ ఎడిషన్ కారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మోడల్‌కు అప్పుడే నో స్టాక్ బోర్డ్ పెట్టడానికి కారణంగా, లాంబోర్గినీ ఈ మోడల్‌ను కేవలం మూడు యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసింది. వెనెనో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3 కార్లను మాత్రమే అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఇప్పటికే అనేక మంది ధనవంతులు ఈ కారును సొంతం చేసుకోవాలని ఎగబడినా ఫలితం మాత్రం శూన్యం.

ప్రస్తుతం వారంతా లాంబోర్గినీ వెనెనోను చిత్రాల్లో చూసుకోవాల్సిందే తప్ప, సొంతం చేసుకోలేదు. అయితే, ఈ కారును ఎవరెవరికి విక్రయించిన విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. దీని ధర 30 లక్షల యూరోలు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.21.4 కోట్లకు పైమాటే (అదీ పన్నులు కలుపుకోకుండా). ఈ కారుకు పరమ వికారమైన డిజైన్ కలిగి ఉన్న కారు అనే మచ్చ కూడా ఉంది. . ఎడ్‌మండ్స్ డాట్‌కామ్ (Edmunds.com) విడుదల చేసిన 10 వికారమైన కార్ల జాబితాలో లాంబోర్గినీ వెనెనో అగ్రస్థానంలో నిలిచింది.

లాంబోర్గినీ వెనెనో
లాంబోర్గినీ వెనెనో
లాంబోర్గినీ వెనెనో
లాంబోర్గినీ వెనెనో
లాంబోర్గినీ వెనెనో
లాంబోర్గినీ వెనెనో
లాంబోర్గినీ వెనెనో

ఇక వెనెనో విషయానికి వస్తే, లాంబోర్గనీ నుండి లభిస్తున్న కార్లలో కెల్లా ఇదే అత్యంత వేగంగా పరుగులు పెట్టేది. 20వ శతాబ్ధానికి చెందిన ఫైటింగ్ బుల్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కారుకు వెనెనో అనే పేరును పెట్టారు. ఈ కారును లాంబోర్గినీ అవెంటేడర్ మోడల్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. దీని ఛాస్సిస్, బాడీలను కార్బనే ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్‌ (సిఎఫ్ఆర్‌పి)లతో తయారు చేశారు. ఇందులో శక్తివంతమైన 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు (అవెంటేడర్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు).

అయితే, ఈ ఇంజన్‌ను కొద్దిగా రీట్యూన్ చేశారు. ఇది గరిష్టంగా 750 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి అవెంటేడర్‌లో ఉపయోగించిన ఇంజన్ కన్నా 50 పిఎస్‌లు అధికం. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ రోబోటైజ్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 13, 2013, 10:29 [IST]
English summary
Lamborghini has celebrated its 50th anniversary at the 2013 Geneva Motor Show with the Lamborghini Veneno. Lamborghini Veneno LP 750-4 is so unique that only 3 models will be built and sold to some very lucky owners.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+