లాంబోర్గినీ వెనెనో 'పరమ వికారమైన కారు': ఎడ్‌మండ్స్ రిపోర్ట్

By Ravi

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారును గుర్తు పట్టారా..? ఇది ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ తమ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత నెలలో జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించిన 'లాంబోర్గినీ వెనెనో ఎల్‌పి 750-4' లిమిటెడ్ ఎడిషన్ కారు. అయితే, ఇది పరమ వికారమైన (అగ్లీయెస్ట్ కార్) కారట. ఈ మాట నేను చెప్పడం లేదండోయ్.. ఎడ్‌మండ్స్ డాట్‌కామ్ (Edmunds.com) విడుదల చేసిన 10 వికారమైన కార్ల జాబితాలో లాంబోర్గినీ వెనెనో అగ్రస్థానంలో నిలిచింది.

వాస్తవానికి ఫెరారీ, మెక్‌లారెన్ కంపెనీలు అదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని అందమైన లాఫెరారీ, పి1 కార్లను తయారు చేశాయి. గడచిన జెనీవా మోటార్ షోలో ఈ రెండు మోడళ్లు షో టాపర్స్‌గా నిలిచాయి. దీనికితోడు లాంబోర్గినీ వెనెనో కారు ధర (రూ.21.4 కోట్లకు పైమాటే) కూడా దీనిని వికారమైన కారుగా పరిగణలోకి తీసుకోవటానికి మరొక కారణమయ్యింది. ఈ కారు డిజైన్ అంత బాగోలేదని, ఇలాంటివి మూడు కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నందకు ధన్యావాదములని ఎడ్‌మండ్ వెటకారం చేసింది.

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో

లాంబోర్గినీ వెనెనో


వాస్తవానికి వెనెనో సూపర్‌కారు, లాంబోర్గనీ నుండి లభిస్తున్న కార్లలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెడుతుంది. 20వ శతాబ్ధానికి చెందిన ఫైటింగ్ బుల్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కారుకు వెనెనో అనే పేరును పెట్టారు. ఈ కారును లాంబోర్గినీ అవెంటేడర్ మోడల్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. దీని ఛాస్సిస్, బాడీలను కార్బనే ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్‌ (సిఎఫ్ఆర్‌పి)లతో తయారు చేశారు. ఇందులో శక్తివంతమైన 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు (అవెంటేడర్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు).

అయితే, ఈ ఇంజన్‌ను కొద్దిగా రీట్యూన్ చేశారు. ఇది గరిష్టంగా 750 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి అవెంటేడర్‌లో ఉపయోగించిన ఇంజన్ కన్నా 50 పిఎస్‌లు అధికం. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ రోబోటైజ్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 30, 2013, 14:47 [IST]
English summary
According to a report revealed by Edmunds.com, it has revealed a list of 100 cars which are the ugliest ever, and on top of this list is the new Lamborghini Veneno which was revealed last month at the 2013 Geneva Motor Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+