టాప్ లెస్ లాంబోర్గినీ వెనెనో రోడ్‌స్టర్ సూపర్‌కార్ విడుదల
ఈ ఫొటోలోని కారును గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లు (చదివినట్లు) ఉంది కదూ..! ఈ కారు పేరు 'లాంబోర్గినీ వెనెనో రోడ్‌స్టర్' (Lamborghini Veneno Roadster). ఈ ఏడాది మార్చ్ నెలలో జరిగిన 2013 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ లాంబోర్గినీ ఆవిష్కరించిన లిమిటెడ్ ఎడిషన్ లాంబోర్గినీ వెనెనో సూపర్‌కారుకు టాప్ లెస్ వెర్షనే ఈ వెనెనో రోడ్‌స్టర్.
లాంబోర్గినీ తమ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆరంభంలో వెనెనో సూపర్ కారును విడుదల చేసింది. అయితే, ఈ కారు ఉత్పత్తిని కేవలం 3 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో, లాంబోర్గినీ తమ క్రేజీ వెనెనో కూపేకు కొనసాగింపుగా ఈ వెనెనో రోడ్‌స్టర్ కారును తయారు చేసింది. ఈ లాంబోర్గినీ వెనెనో రోడ్‌స్టర్ సూపర్‌కారు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

లాంబోర్గినీ వెనెనో కూపే వెర్షన్‌లో రిమూవబల్ రూఫ్ ఉండేది, అయితే వెనెనో రోడ్‌స్టర్ ఈ రూఫ్‌ను పూర్తిగా తొలగించి వేశారు.

ఇందులో శక్తివంతమైన 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 750 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ రోబోటైజ్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ ఇంజన్ నుంచి వచ్చే శక్తి అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ (ఆల్-వీల్ డ్రైవ్) అవుతుంది. రూఫ్ లేకపోయినప్పటికీ వెనెనో రోడ్‌స్టర్ బరువు 1490 కేజీల బరువును కలిగి ఉంటుంది.

లాంబోర్గినీ వెనెనో రోడ్‌స్టర్ కేవలం 2.9 సెకండ్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. (రూఫ్ లేకుండా ఈ వేగాన్ని ఊహించుకోండి).

లాంబోర్గినీ వెనెనో రోడ్‌స్టర్ గరిష్ట వేగం గంటకు 354 కిలోమీటర్లు. (రూఫ్ లేకుండా ఇంతటి వేగాన్ని ప్రాక్టికల్‌గా అనుభవించిన వారిలో ఫార్ములా వన్ డ్రైవర్లు కొందరు).

వెనెనో కూపే, వెనెనో రోడ్‌స్టర్ ఇంటీరియర్లలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు. వెనెనో రోడ్‌స్టర్ విండోస్‌ను మాత్రం కొద్దిగా మార్చారు.

సాధారణంగా వెనెనో రోడ్‌స్టర్‌ను ఏ కొనుగోలుదారుడైన తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు కానీ, రోస్సో వెనెనో కలర్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా వెనెనో రోడ్‍స్టర్‌కు మాత్రమే పరిమితం చేశారు.

లాంబోర్గినీ వెనెనో కూప్ కారు ఉత్పత్తిని 3 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయగా, వెనెనో రోడ్‌స్టర్ ఉత్పత్తిని మాత్రం 9 యూనిట్లకు పరిమితం చేశారు.

లాంబోర్గినీ వెనెనో రోడ్‌స్టర్ కారు ధర 5.3 మిలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు 32.66 కోట్లు).


Click it and Unblock the Notifications








