భారత్‌లో ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 స్టెర్లింగ్ ఎడిషన్ విడుదల
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ 'ఫ్రీల్యాండర్ 2'లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 'ఫ్రీల్యాండర్ 2 స్టెర్లింగ్' పేరుతో ల్యాండ్ రోవర్ విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.44.41 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
రెగ్యులర్ ఫ్రీల్యాండర్ 2తో పోల్చుకుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫ్రీల్యాండర్ మోడల్ స్పోర్టీ ఎక్స్టీరియర్‌ను కలిగి ఉంటుంది. ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లోకి ప్రవేశించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫ్రీల్యాండర్ 2ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 స్టెర్లింగ్ ఎడిషన్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు.
ఇందులో ఇదివరకటి 2.2. లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 150 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త వేరియంట్‌లో 17 ఇంచ్ ఫైవ్-స్ప్లిట్ అల్లాయ్ వీల్స్, డార్క్ అట్లాస్ గ్రిల్స ఫెండర్ అండ్ సైడ్ వెంట్స్, బ్రైట్ ఫినిష్‌తో కూడిన టెయిల్‌గేట్, స్పాయిలర్, ఫ్రండ్ అండ్ రియర్ ఆఫ్రాన్, లోవర్ డోర్ క్లాడింగ్స్ మరియు సింగిల్ టెయిల్ పైప్స్‌ను ఇందులో గమనించవచ్చు.

భారత మార్కెట్లో ల్యాండర్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 స్టెర్లింగ్ ఎడిషన్‌ను విడుదల చేయటం సంతోషంగా ఉందని, ఇప్పటికే పాపులర్ అయిన ఈ మోడల్‌కు తాజా వేరియంట్ మరింత బలం చేకూర్చుతుందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు.
ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 వేరియంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
* ఫ్రీల్యాండర్ 2 ఎస్ఈ - రూ.43.25 లక్షలు (ఎక్స్-ఢిల్లీ)
* ఫ్రీల్యాండర్ 2 హెచ్ఎస్ఈ - రూ.48.50 లక్షలు (ఎక్స్-ఢిల్లీ)
* ఫ్రీల్యాండర్ 2 స్టెర్లింగ్ ఎడిషన్ - రూ.44.41 లక్షలు (ఎక్స్-ముంబై)


Click it and Unblock the Notifications








