మేడ్ ఇన్ ఇండియా ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 విడుదల
బ్రిటన్‌కు చెందిన లగ్జరీ ఎస్‌యూవీ బ్రాండ్ ల్యాండ్ రోవర్ భారత్‌లో స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన సరికొత్త అప్‌గ్రేడెడ్ 'ఫ్రీల్యాండర్ 2' లగ్జరీ కారును నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 లగ్జరీ ఎస్‌యూవీకి దేశీయ విపణిలో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, డిమాండుకు అనుగుణంగా సప్లయ్‌ను అందించేందుకు కంపెనీ ఈ మోడల్‌ను మే 2011 నుంచి పూనేలోని తమ ప్లాంటులో అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించింది.
ల్యాండ్ రోవర్ విడుదల చేసిన ఈ అప్‌డేటెడ్ ఫ్రీల్యాండర్ 2 ఎస్‌యూవీ యొక్క సరికొత్త ఎక్స్టీరియర్స్ ఈ కారుకు మరింత అధనపు స్పోర్టీ అండ్ లగ్జరీ లుక్‌నిస్తాయి. ఇందులో తాజా ఇంటీరియర్స్ సౌకర్యవంతమైన అనుభూతిని కల్పిస్తాయి. ఈ కారులో కొత్తగా 7-ఇంచ్ కలర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను అమర్చారు. ఇందులో అమర్చిన మెరీడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ థియేటర్ క్వాలిటీ అనుభూతిని కల్పిస్తుంది.
ఇంకా ఈ సరికొత్త ల్యాండ రోవర్ ఫ్రీల్యాండర్‌లో పాసివ్ స్టార్ట్, రియర్ వ్యూ కెమెరా, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సిస్టమ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన జెనాన్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్ మరియు ఆర్మ్ రెస్ట్స్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి. హెచ్ఎస్ఈ మోడళ్లలో సరికొత్త 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. భారత మార్కెట్లో రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ల్యాండర్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 ఎస్‌యూవీధరలు ఈ విధంగా ఉన్నాయి:
- 2.2 లీటర్ డీజిల్ టిడి4 ఎస్ఈ (150 పిఎస్) - రూ.38.67 లక్షలు
- 2.2 లీటర్ డీజిల్ ఎస్‌డి4 హెచ్ఎస్ఈ (190 పిఎస్) - రూ.43.92 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

2013 ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2



Click it and Unblock the Notifications








