మరికొద్ది వారాల్లో విడుదల కానున్న 2013 టాటా నానో
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'లో ఓ అప్‌డేటెడ్ వెర్షన్ మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదవరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, 2013 వెర్షన్ టాటా నానో ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ప్రముఖ ఆటోమొబైల్ మ్యాగజైన్ ఆటోకార్ ఇండియా కొత్త నానో ఫొటోలను తమ కెమరాల్లో బంధించింది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, మరికొద్ది వారాల్లోనే ఈ కొత్త నానో మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2013 టాటా నానో స్పై చిత్రాలను బట్టి చూస్తే, ముందు వెనుక వైపుల కొత్త బంపర్లు, క్రోమ్ స్ట్రిప్‌లను గమనించవచ్చు. అంతకు మించి బయటివైపు పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు. ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను వెనుక వైపు బంపర్‌కు పెద్ద ఎయిర్ వెంట్స్ ఉండేలా డిజైన్ చేశారు.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే, బ్లూటూత్ ఆప్షన్‌తో కూడిన స్టీరియో ఆడియో సిస్టమ్, గ్లవ్ బాక్స్, కొత్త కలర్ ఆప్షన్స్ వంటి కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్ టాటా నానోలో డ్యాష్‌బోర్డ్‌కు రెండు వైపులా అమర్చిన స్పీకర్లు, సిడి, ఎమ్‌పి3, ఆక్స్-ఇన్, యూఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్‌తో లభించనుంది.
ఇంజన్‌ను కూడా రీట్యూన్ చేసి మరింత నాణ్యతగా, విశ్వసనీయ స్థాయిని పెంచేలా అభివృద్ధి చేశారు. ధర విషయంలో ఇది ప్రస్తుతం లభిస్తున్న 2012 టాటా నానో కన్నా కాస్తంత అధికంగా ఉండే ఆస్కారం ఉంది. కొత్త నానో విడుదలతో ఈ మోడల్ అమ్మకాలు మరోసారి జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.




Source: Autocar India


Click it and Unblock the Notifications








