టాటా జెస్ట్ డీజిల్ ఏఎమ్‌టి కోసం సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే విడుదల చేసిన తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్' మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. సరికొత్త ఇంజన్, మోడ్రన్ డిజైన్, హై-ఎండ్ ఫీచర్స్, ఏఎమ్‌టి (డీజిల్ వెర్షన్లో మాత్రమే) వంటి ఫీచర్లతో టాటా మోటార్స్ ఆఫర్ చేస్తున్న ఈ సరికొత్త జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు క్యూ కడుతున్నారు.
ఇది కూడా చదవండి: టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ ఫుల్ డిటేల్స్
ప్రత్యేకించి ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కలిగిన డీజిల్ వెర్షన్ కారుకు మంచి డిమాండ్ ఉంటోంది. దీంతో ఈ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. మారుతి సుజుకి ఇండియా విడుదల చేసిన తమ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో కూడా కంపెనీ ఏఎమ్‌టి (పెట్రోల్ వెర్షన్‌లో)ని ఆఫర్ చేసి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసినదే.

టాటా మోటార్స్ కూడా ఇదే బాటలో తమ జెస్ట్ సెడాన్‌లో ఏఎమ్‌టిని ఆఫర్ చేసి, సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ రెండు సంస్థలకు ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లను సరఫరా చేస్తున్నది ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీ సంస్థే. టాటా మోటార్స్ తమ జెస్టా కాంపాక్ట్ సెడాన్‌లో ఉపయోగించిన ఏఎమ్‌టికి ఎఫ్-ట్రానిక్ అనే పేరును పెట్టింది.
ప్రస్తుతం టాటా జెస్ట్ ఎక్స్ఎమ్ఏ ఎఫ్-ట్రానిక్ డీజిల్ వెర్షన్ వెయిటింగ్ పీరియడ్ సుమారు 3-4 నెలలు ఉంటోది. అలాగే, అధిక డిమాండ్ కారణంగా, ఇతర జెస్ట్ సెడాన్ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ ఒకటిన్నర నెల నుంచి రెండు నెలల వరకు ఉంటోంది.

టాటా జెస్ట్ విషయానికి వస్తే.. పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 17.6 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.
డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. ఇది లీటరుకు 23 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








