భారత్‌పై కన్నేసిన లోటస్, స్పైకర్, పగని లగ్జరీ కార్ బ్రాండ్స్
భారత్‌లో సంపన్నులు అధికమవుతున్న తరుణంలో, వారిని ఆకట్టుకునేందుకు లగ్డరీ బ్రాండ్‌లు కూడా కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఇందులో ప్రధానంగా లగ్జరీ కార్ బ్రాండ్‌లకు భారత్‌కు వలస వస్తున్నాయి. ఇప్పటికే భారతీయ సంపన్నులకు వల వేసేందుకు ఫెరారీ, లాంబోర్గినీ, బుగాటి, కొయినిగ్‌సెగ్ వంటి సూపర్ కార్ కంపెనీలు ఇండియాకు వచ్చిన సంగతి తెలిసినదే.
తాజాగా, ఇదే బాటలో మరిన్ని యూరోపియన్ లగ్జరీ కార్ బ్రాండ్‌లు ఇండియాకు రానున్నాయి. అందులో, ఇటలీకి చెందిన పగని ఆటోమొబిలి, యూకేకు చెందిన లోటస్, నెథర్లాండ్స్‌కు చెందిన స్పైకర్ కంపెనీలు ఇప్పుడు భారత మార్కెట్‌పై కన్నేశాయి. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఈ మూడు కంపెనీలు భారత్‌లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరి ఈ మూడు కంపెనీలు భారత్‌లో ఆఫర్ చేయబోయే ఆ సూపర్ డూపర్ కార్లేంటో చూద్దాం రండి..!

స్పెకర్ సి8 ఐలెరాన్
ఈ మూడు కంపెనీల్లో తొలుతగా స్పైకర్ భారత మార్కెట్లోకి ప్రవేశించే ఆస్కారం ఉంది. 2014 ఆరంభంలో ఇది భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. భారత్‌లో ఇప్పటికే ఓ స్థానిక డీలరును కూడా గుర్తించినట్లు సమాచారం.

స్పైకర్ బి6 వెనాటర్
ఆరంభంలో భాగంగా స్పైకర్ తమ సి8 ఐలెరాన్ సూపర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 4.2 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 400 హెచ్‌పిల శక్తిని, 480 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 300 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఈ మోడల్ తర్వాత బి6 వెనాటర్ కారును విడుదల చేసే ఆస్కారం ఉంది.

పగని హుయారా
ఇటలీకి చెందిన హైపర్ కార్ల తయారీ సంస్థ పగని ఉత్పత్తి చేస్తున్న జోండా, హుయారా మోడళ్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కార్లలో పగని హుయారా కూడా ఒకటి.

పగని హుయారా
పగని హుయారాలో 700 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 6.0 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను ప్రత్యేకంగా ఏఎమ్‌జి డెవలప్ చేసింది. పగని తమ ఇండియన్ ఎంట్రీ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సన్నాహాలు మాత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోటస్
లోటస్ కంపెనీ పగని మాదిరిగా కాకపోయినప్పటికీ, ఇది తేలికైన చక్కటి స్పోర్ట్స్ కార్లను తయారు చేస్తుంది. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. భారత మార్కెట్ శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తున్నామని లోటస్ పేర్కొంది.

ఈ మూడు సూపర్ కార్ తయారీ కంపెనీలు కూడా అతి తక్కువ సంఖ్యలోనే తమ ఉత్పత్తులను భారత మార్కెట్లో విక్రయించనున్నారు. ఇందుకు ప్రధాన కారణం, వీటి ఉత్పత్తుల అధిక ధరలే. డీలర్‌షిప్ కేంద్రాలను కూడా దేశంలోని ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం చేసే ఆస్కారం ఉంది.

ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








