లో ప్రొఫైల్ టైర్స్ వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు

By Ravi

స్టాండర్డ్ వీల్స్ అండ్ టైర్స్ కన్నా పెద్దవిగా ఉండే వీల్స్, టైర్లను అమర్చుకున్న కార్లను మీరెప్పుడైనా చూశారా? అసలు అలా ఎందుకు కస్టమైజ్ చేసుకుంటారు? వీల్స్, టైర్స్ మార్చుకోవటం వలన మైలేజ్ తగ్గుతుందా? ఇలా టైర్లను కస్టమైజ్ చేసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు ఏంటి? ఈ సందేహాలన్నింటికీ సమాధానమే ఈ కథనం.

చాలా వరకు కంపెనీలు పెద్ద చక్రాలను, లో ప్రొఫైల్ టైర్లను కారుతో పాటుగా స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా ఆఫర్ చేయవు. కార్ కస్టమైజేషన్ చేసే ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్ కంపెనీలు వీటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవి స్టాండర్డ్ వీల్స్, టైర్స్ కన్నా విభిన్నంగా ఉంటాయి. చక్రాలు పెద్దవిగా ఉంటే టైర్లు సాధారణ టైర్ల కన్నా పలుచగా ఉంటాయి. ఈ లో ప్రొఫైల్ టైర్ల వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

లో ప్రొఫైల్ టైర్స్

తర్వాతి స్లైడ్‌లలో లో ప్రొఫైల్ టైర్ల వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలను తెలుసుకోండి.

Picture credit: Flickr

Bobenis

టైరు సైజ్ తెలుసుకోవటం ఎలా?

టైరు సైజ్ తెలుసుకోవటం ఎలా?

ప్రతి టైరుపై దాని పరిమాణం, వెడల్పు మదలైన సమాచారం ఉంటుంది. టైరుపై ఉండే సమాచారన్ని ఎలా తెలుసుకోవాలో చూడండి. ఉదాహరణకు టైరుపై 305/30ZR19 అని ఉంటే దానిని క్రింది విధంగా అర్థం చేసుకోవాలి:

305: టైరు వెడల్పు మిల్లీ మీటర్లలో

30: టైరు ప్రొఫైల్ లేదా ఆస్పెక్ట్ రేషియో

Z: ఇది టైరు స్పీడ్ రేటింగ్ (సాధారణంగా గంటకు 300 కి.మీ. వేగానికి పైగా వెళ్ల గలిగే టైర్లకు ‘Z' రేటింగ్ ఇస్తారు)

R: రేడియల్ కన్‌స్ట్రక్షన్

19: టైరు వ్యాసం (ఇంచ్‌లలో)

టైరు ప్రొఫైల్ అంటే ఏమిటి?

టైరు ప్రొఫైల్ అంటే ఏమిటి?

టైరు ప్రొఫైల్ అంటే దాని సైడ్‌వాల్స్ డెప్త్ (టైరు సైడ్స్ లోతు లేదా ఎత్తు) దీనిని టైరు వెడల్పును బట్టి లెక్కిస్తారు. మన ఉదాహరణలో 305/30ZR19 టైరు ప్రొఫైల్ లేదా ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 30, అంటే టైరు మొత్తం వెడల్పు 305 మిల్లీ మీటర్లలో సైడ్‌వాల్ డెప్త్ 30 శాతం ఉంటుందున్నమాట. సాధారణంగా లో ప్రొఫైల్ టైర్ల ఆస్పెక్ట్ రేషియో 60 నుంచి ప్రారంభమవుతుంది, వీటి సైడ్‌వాల్ డెప్త్ చాలా తక్కువగా ఉంటుంది.

Picture credit: Flickr

Dennis Larson

లో ప్రొఫైల్ టైర్లు - ప్రయోజనాలు

లో ప్రొఫైల్ టైర్లు - ప్రయోజనాలు

లో ప్రొఫైల్ టైర్ల వలన కారు అందం మారడమే కాకుండా, వీటి వలన రోడ్డుపై ప్రత్యేకించి పోడిగా ఉండే రోడ్లపై కారు హ్యాండ్లింగ్ మరియు గ్రిప్ చాలా సమర్థవంతంగా ఉంటుంది. బ్రేకింగ్ కూడా ఇదివరకటి కన్నా బెటర్‌గా ఉంటుంది. సాధారణ టైర్ల కన్నా వెడల్పుగా ఉండే ఈ లో ప్రొఫైల్ టైర్లు రోడ్డుపై మంచి ట్రాక్షన్‌ను ఆఫర్ చేస్తాయి. ప్రత్యేకించి మలుపుల వద్ద మంచి కార్నింగ్ ఫోర్సెస్‌ను ఆఫర్ చేస్తాయి. ఈ టైర్ల వలన స్టీరింగ్ పెర్ఫార్మెన్స్ కూడా మెరుగు పడుతుంది.

లో ప్రొఫైల్ టైర్లు - దుష్ప్రయోజనాలు

లో ప్రొఫైల్ టైర్లు - దుష్ప్రయోజనాలు

లో ప్రొఫైల్ టైర్ల వలన ప్రయోజనాలతో పాటుగా కొన్ని దష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా, మన రోడ్లను పరిగణలోకి తీసుకుంటే, ఈ లో ప్రొఫైల్ టైర్లలో ఎయిర్ కుషన్ చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి గుంతలు కలిగిన రోడ్లపై ఈ టైర్లు ఎక్కవ ప్రభావానికి గురై టైర్, రిమ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ టైర్ల వలన రోడ్ నాయిస్ కూడా పెరుగుతుంది.

దుష్ప్రయోజనాలు

దుష్ప్రయోజనాలు

ఇంకా.. వర్షాకాలంలో ఈ టైర్లతో కొంచెం రిస్కే. నీరు నిలిచి ఉండే రోడ్లపై ఇవి సాధారణ టైర్ల మాదిరిగా రెసిస్టెన్స్‌ను కలిగి ఉండవు, ఈ లో ప్రొఫైల్ టైర్లు తడిసిన రోడ్లపై ట్రాక్షన్‌ను కోల్పోయి, వాహనం జారిపోయే ప్రమాదం ఉంటుంది. మైలేజ్ కూడా ప్రభావితం అవుతుంది (తగ్గుతుంది). ఇవి స్టాండర్డ్ టైర్ల కన్నా ఖరీదైనవి.

ముఖ్యమైన విషయం..

ముఖ్యమైన విషయం..

కార్ మేకర్లు ఒరిజినల్ సైజ్ కన్నా గరిష్టంగా 3 శాతం పెంచుకునేందుకు మాత్రమే అవకాశాన్ని కల్పిస్తారు. అంతకు మించు పెంచుకోవాలని చూస్తే, పైన పేర్కొన్న హ్యాండ్లింగ్ అడ్వాంటేజ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మరియు పెద్ద సైజు టైర్లు ఇందులో ఫిట్ కాకపోవచ్చు కూడా. ఈ టైర్లు త్వరగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఇవి కాకుండా, లో ప్రొఫైల్ టైర్లకు సంబంధించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మా పాఠకులతో పంచుకోగలరు.

Picture credit: Flickr

Vulcho

టైరు అపోహలు - వాస్తవాలు

ఇది కూడా చదవండి: టైర్ల విషయంలో అపోహలు మరియు వాస్తవాలు

Most Read Articles

English summary
What you're seeing on these cars is an aftermarket modification, that of the fitment of bigger rims and low profile tyres. These tyres are ‘thinner' than conventional tyres and thus allow for bigger wheels to be installed in the same wheel well. However, while these tyres certainly look the part, there is more to know about them before rushing out and purchasing a set for your car.
Story first published: Monday, July 14, 2014, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X