దిగొస్తున్న లగ్జరీ కార్ల ధరలు.. కారణం ఏమిటి..?
భారత లగ్జరీ కార్ మార్కెట్లో ఇటీవలి కాలంలో విలాసవంతమైన కార్ల ధరలు భారీగా దిగొస్తున్నాయి. దేశీయ విపణిలో లగ్జరీ కార్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, లగ్జరీ కార్ కంపెనీ తమ కార్లను పూర్తి విదేశాల్లో తయారు చేసి ఇండియాకు దిగుమతి చేసుకోకుండా, విడిభాగాల రూపంలో కారును ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తుండటంతో ధరలు భారీగా తగ్గుతున్నాయి.
ఏదైనా లగ్జరీ కారును పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే, మన దేశ సుంకాల ప్రకారం సదరు కారుపై 100 శాతానికి పైగా పన్ను వర్తిస్తుంది. అంటే ఉదాహరణకు, రూ.25 లక్షల ఖరీదు చేసే కారును విదేశాల నుంచి ఇండియాకు దిగుమతి చేసుకుంటే, ఆ కారు కస్టమర్‌కు చేరే నాటికి దాని ధర రూ.50 లక్షలకు పైగా ఉంటుంది. అంటే దాని ధర దాదాపు రెట్టింపు అవుతుందన్నమాట.
అదే కారును విడి భాగాల రూపంలో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తే దాని ధర భారీగా తగ్గుతుంది. ఎందుకంటే, పూర్తిగా తయారైన కార్లపై విధించే దిగుమతి సుంకాల కన్నా, విడిభాగాలపై విధించే దిగుమతి సుంకమే తక్కువగా ఉంటుంది. అందుకే, ఇప్పుడు దాదాపు అన్ని లగ్జరీ కార్ కంపెనీలు గిరాకీ ఎక్కువగా ఉండే తమ మోడళ్లను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేస్తున్నాయి.

ఇటీవల జాగ్వార్ తమ 3.0లీ ఎక్స్‌జే మోడల్‌ను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయటం వలన దాని ధర రు.25 లక్షల పైగా దిగొచ్చింది (ప్రస్తుత ధర రూ.91 లక్షలు). అలాగే మెర్సిడెస్ బెంజ్ తమ ఎస్-క్లాస్ 500 మోడల్‌ను ఇండియాలో అసెంబ్లిగ్ చేయటం వలన దాని ధర కూడా సుమారు రూ.30 లక్షల మేర తగ్గింగి (ప్రస్తుత ధర రూ.1.36 కోట్లు), అదేవిధంగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మోడల్ ధర కూడా రూ.10 లక్షల మేర తగ్గింది (ప్రస్తుత ధర రూ.70.9 లక్షలు).
అధికారిక లెక్కల ప్రకారం, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో భారత లగ్జరీ కార్ మార్కెట్లో కేవలం 28,000 కార్లు మాత్రమే అమ్ముడుపోతే, గడచిన ఆర్థిక సంవత్సరంలో 35,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ లెక్కలను బట్టి చూస్తుంటే, ప్రతి ఏటా లగ్జరీ కార్ మార్కెట్ ఎంత మేర వృద్ధి చెందుతుందో తెలిసిపోతోంది.


Click it and Unblock the Notifications








