అరేబియన్ గుర్రం.. లైకన్ హైపర్‌స్పోర్ట్
ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు ధర సుమారు రూ.22 కోట్లు. అరేబియాకు చెందిన మొట్టమొదటి సూపర్‌కారు ఇది. పూర్తిగా దుబాయ్‌లోనే అభివృద్ధి చేయబడిన ఈ లోకల్ సూపర్‌కారును లెబనెన్స్‌కి చెందిన డబ్ల్యూ మోటార్స్ అనే సంస్థ తయారు చేసింది.
ఈ కారు పేరు 'లైకన్ హైపర్‌స్పోర్ట్' (Lykan Hypersport). ఈ మేడ్ ఇన్ దుబాయ్ కారును ఇటీవలే అక్కడి మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంచారు. అత్యంత విలాసవంతమైన ఫీచర్లతో తయారు చేయబడిన ఈ కారు వెల రూ.3.4 మిలియన్ డాలర్లు.

డబ్ల్యూ మోటార్స్ కంపెనీ 2012లో స్థాపించారు, ఈ కంపెనీ తమ తొలి కాన్సెప్ట్‌ను 2013 దుబాయ్ మోటార్ షోలో ఆవిష్కరించింది. ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను ఇటీవలే మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం అక్కడి మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన కార్లలో లైకన్ హైపర్‌స్పోర్ట్ కూడా ఒకటి.
ఈ కారు విలువ అంత అధికంగా ఉండటానికి కారణం ఏంటంటే.. దీని హెడ్‌లైట్స్‌లో వజ్రాలు పొదగబడి ఉంటాయి. ఈ హెడ్‌లైట్స్‌ను టైటానియం ఎల్ఈడి బ్లేడ్స్‌తో తయారు చేశారు. ఇందులో మొత్తం 420 వజ్రాలు ఉంటాయి. కస్టమర్లు తమకు నచ్చిన వజ్రాలు, రూబీలను ఎంచుకునే వెసలుబాటు కూడా ఉంటుంది.

ఇక ఈ సూపర్‌కారు ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 3.7 లీటర్, ట్విన్-టర్బో, ఫ్లాట్ సిక్స్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 740 బిహెచ్‌పిల శక్తిని, 960 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 394 కిలోమీటర్లు.
ఈ ఇంజన్ 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఈ కారు నిర్మాణంలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ మెటీరియల్స్‌ను ఉపయోగించారు. ఈ కారులోని ఇంటీరియర్స్ ఫ్యూచర్ కార్లను తలపించేలా ఉంటాయి.


Click it and Unblock the Notifications








