మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్‌జే 2.0 పెట్రోల్ విడుదల

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), స్థానికంగా భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేసిన 'జాగ్వార్ ఎక్స్‌జె' కారును మార్కెట్లో విడుదల చేసింది.

గడచిన సంవత్సరం డీజిల్ వెర్షన్ జాగ్వార్ ఎక్స్‌జె 3.0లీ ఎల్‌డబ్ల్యూబి (లాంగ్ వీల్ బేస్) వేరియంట్‌ను భారత మార్కెట్లో విజయవంతంగా విడుదల చేసిన జేఎల్ఆర్, ఇప్పుడు ఇందులో పెట్రోల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.


దేశీయ విపణిలో ఈ కొత్త జాగ్వార్ ఎక్స్‌జే 2.0లీ పెట్రోల్ ఎల్‌డబ్ల్యూబి (లాంగ్ వీల్ బేస్) వేరియంట్ ధరను రూ.93.24 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించారు.

జాగ్వార్ ఎక్స్‌జే 2.0లీ పెట్రోల్ ఎల్‌డబ్ల్యూబి వేరియంట్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ ఐ4, 6-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 177 కివా శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 340 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

Jaguar XJ 2L Petrol Interiors

ఈ కొత్త మోడల్‌ను పూనే ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఈ లగ్జరీ కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ రియర్ సీట్ (3 రకాల సెట్టింగ్స్‌తో కూడిన మసాజ్ ఫంక్షన్‌తో), 10 అంగుళాల ఎల్‌సిడి స్క్రీన్స్‌తో కూడిన రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ (వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల వినోదం కోసం) వంటి ఫీచర్లున్నాయి.

ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ రియర్ సైడ్ విండో బ్లైండ్స్, సాఫ్ట్ డోర్ క్లోజ్, 825 వాట్ మెరీడియన్ ఆడియో సిస్టమ్, ఎల్‌ఈడి రీడింగ్ లైట్స్, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం కొత్తగా డిజైన్ చేసిన బిజినెస్ టేబుల్స్ మొదలైన విలాసవంతమైన ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 17, 2014, 9:37 [IST]
English summary
After the successful launch of Jaguar XJ 3.0L Diesel LWB recently this year, Jaguar India announced the launch of the locally manufactured Jaguar XJ 2.0L Petrol LWB Portfolio at a price of INR 93.24 lakhs (ex-showroom Mumbai, Pre Octroi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+