ఎక్సైజ్ డ్యూటీ కట్: వాహనాల ధరలు తగ్గించిన మహీంద్రా
భారత సర్కారు ఇటీవలే ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఎస్‌యూవీలు, కాంపాక్ట్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించిన నేపథ్యంలో, కార్ల తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నారు. తాజాగా.. ప్రముఖ దేశూయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఉత్పత్తుల ధరలను తగ్గిసున్నట్లు ప్రకటించింది.
మోడల్‌ను బట్టి వివిధ రకాల వాహనాలపై రూ. 13,000 నుండి రూ.49,000 వరకూ ధరలను తగ్గిస్తున్నామని కంపెనీ పేర్కొంది. వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని, ఇప్పటికే సంస్థ విక్రయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బడ్జెట్ సదుపాయాలతో మరింత ఎక్కవ విక్రయాలను నమోదుచేసుకునే వీలుంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పర్విన్ షాహ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర తగ్గింపు

తాము ఉత్పత్తి చేసే అన్ని వాహనాలపైనా ఈ తగ్గింపు ధరలు వర్తించే వీలును కల్పిస్తామని, ప్రపంచ మార్కెట్‌లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసుకుంటున్న తరుణంలో మరోసారి తమ సంస్థకు చెందిన రికార్డును తిరగరాయడానికి కృషి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహీంద్రా అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ రెక్స్టన్ ధరలు రూ.92,000 మేర దిగొచ్చాయి.


Click it and Unblock the Notifications








