మహీంద్రా మాన్‌సూన్ ఆఫర్; కార్లపై భారీ డిస్కౌంట్స్

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) 'మాన్‌సూన్' ఆఫర్‌ను ప్రకటించింది. మహీంద్రా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న చవక ఎస్‌యూవీ బొలెరో నుంచి కంపెనీ అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ రెక్స్టన్ వరకు దాదాపు అన్ని మోడళ్లపై కంపెనీ భారీ తగ్గింపులను అందిస్తోంది.

ఈ జూన్ నెలలో మహీంద్రా వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులు మోడల్‌ను బట్టి కనిష్టంగా రూ.16,000ల నుంచి గరిష్టంగా రూ.75,000ల వరకూ తగ్గింపులను అంతేకాకుండా, జూన్ 30, 2014 లోపుగా మహీంద్రా కార్లను బుక్ చేసుకున్న వారికి ప్రస్తుత ధరకే వాహనాలను డెలివరీ చేస్తారు. అదే జులైలో బుక్ చేసుకుంటే, మారబోయే బడ్జెట్‌ను అనుసరించి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

మహీంద్రా తమ వాహనాలపై అందిస్తున్న ఆఫర్ల వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్

మాన్‌సూన్ ఆఫర్‌లో భాగంగా, మహీంద్రా అండ్ మహీంద్రా వివిధ మోడళ్లపై అందిస్తున్న డిస్కౌంట్లను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

బొలెరో

బొలెరో

మహీంద్రా అందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ బొలెరోపై కంపెనీ రూ.19,000ల బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది.

క్వాంటో

క్వాంటో

మహీంద్రా అందిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్వాంటోపై కంపెనీ రూ.16,000ల బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది.

జైలో

జైలో

మహీంద్రా అందిస్తున్న స్టయిలిష్ ఎమ్‌పివి జైలోపై కంపెనీ ఏకంగా రూ.75,000ల బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది.

స్కార్పియో

స్కార్పియో

మహీంద్రా అందిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ స్కార్పియోపై కంపెనీ రూ.60,000ల బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది.

ఎక్స్‌యూవీ500

ఎక్స్‌యూవీ500

మహీంద్రా అందిస్తున్న స్టయిలిష్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500పై కంపెనీ రూ.25,000ల బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది.

వెరిటో వైబ్‌

వెరిటో వైబ్‌

మహీంద్రా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ వెరిటో వైబ్‌పై కంపెనీ రూ.26,000ల బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్

శాంగ్‌యాంగ్ రెక్స్టన్

మహీంద్రా అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌పై కంపెనీ రూ.35,000ల బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తోంది.

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా మాన్‌సూన్ ఆఫర్స్ జూన్ 30 వరుకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో అధీకృత మహీంద్రా డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 21, 2014, 12:18 [IST]
English summary
Mahindra has announced Monsoon discount offer for all the models. The stylish MPV Xylo has got the biggest discount up to Rs 75,000 while milestone performer, Scorpio is bestowed with a reduction of Rs 60,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+