భారతదేశపు నెంబర్ వన్ ఎస్‌యూవీ 'మహీంద్రా బొలెరో'
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎంట్రీ-లెవల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ 'మహీంద్రా బొలెరో' భారతదేశపు నెంబర్ వన్ ఎస్‌యూవీగా నిలిచింది. దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎస్‌యూవీగా ఇది సరికొత్త రికార్డును స్థాపించింది.
మహీంద్రా బొలెరో 2000వ సంవత్సరంలో భారత మార్కెట్లోకి ప్రవేశిచింది, అప్పటి నుంచి ఇది ఈ సెగ్మెంట్లోనే తిరుగులేని వాహనంగా నిలించింది. ఎస్‌యూవీ విభాగంలో అనేక కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ఏది కూడా బొలెరోకు పోటీగా నిలబడలేకపోయింది.
మహీంద్రా అండ్ మహీంద్రా 2013 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,17,665 బొలెరో వాహనాలను విక్రయించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1,00,686 యూనిట్లుగా ఉంది. ఇది మార్కెట్లోకి విడుదలైన 13 ఏళ్ల కాలంలో సుమారు 6.5 లక్షలకు పైగా బొలెరోలు అమ్ముడుపోయాయంటేనే, ఈ ఎస్‌యూవీకి ఉండే క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

గడచిన 2007 ఆర్థిక సంవత్సరం నుంచి భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎస్‌యూవీగా మహీంద్రా బొలెరో నిలిచింది.

వరుసగా రెండేళ్ల పాటు 1,00,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయిన ఏకైక ఇండియన్ ఎస్‌యూవీ కూడా మహీంద్రా బొలెరోనే.

ఏప్రిల్-సెప్టెంబర్ 2013 కాలంలో, భారత్‌లోని 10 ప్యాసింజర్ వాహనాల్లో మహీంద్రా బొలెరో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, ఈ జాబితాలోని ఏకైక ఎస్‌యూవీ కూడా ఇదొక్కటే.

మహీంద్రా బొలెరో దేశీయ విపణిలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 6.5 లక్షలకు పైగా వాహనాలు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.

ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ, మార్కెట్ ఇన్‌ఫర్మేషన్ గ్రూప్ టేలర్ నెల్సన్ సోఫ్రెస్ నిర్వహించిన కస్టమర్ శాటిస్‌ఫాక్షన్ 2012 సర్వేలో మహీంద్రా బొలెరో నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకుంది.

ఈ మైలురాయి విజయాన్ని పురస్కరించుకొని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఆటోమోటివ్ డివిజన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా మాట్లాడుతూ.. 13 ఏళ్లుగా సుమారు 6.5 లక్షల బొలెరోలు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయని, ఇది ఎస్‌యూవీ విభాగపు రూపు రేఖలనే మార్చి వేసిందని అన్నారు. అలాగే, వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు బొలెను అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నామని కూడా ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








