మహీంద్రా బొలెరో స్పెషల్ ఎడిషన్.. ఇప్పుడు ఏబిఎస్ ఫీచర్‌తో..

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ 'మహీంద్రా బొలెరో'లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. టాప్-ఎండ్ జెడ్ఎల్ఎక్స్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ ఉత్పత్తి కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసినట్లు కంపెనీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: డాట్సన్ గో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్..

మహీంద్రా బొలెరో స్పెషల్ ఎడిషన్ కొత్త పెరల్ వైట్ కలర్‌లో లభ్యం కానుంది. ఇందులో స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్, యూరోపియన్ లెథర్ ఇంటీరియర్స్, బ్లూ విజన్ హెడ్‌ల్యాంప్స్, మ్యూజిక్ సిస్టమ్ (బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీతో) వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఈ వేరియంట్లో ప్రధానంగా.. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) సేఫ్టీ ఫీచర్‌ను అందిస్తున్నారు.

Mahindra Bolero Special Edition With ABS

యాంత్రికపరంగా కొత్త మహీంద్రా బొలెరో స్పెషల్ ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి బొలెరోలో ఉపయోగించిన 2.5 లీటర్ ఎమ్2డిఐసిఆర్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3000 ఆర్‌పిఎమ్ వద్ద 62 హెచ్‌పిల శక్తిని, 1400-2200 ఆర్‌పిఎమ్ వద్ద 195 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ స్పెషల్ ఎడిషన్ మహీంద్రా బొలెరో కేవలం 500 యూనిట్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ వెర్షన్ బొలెరో (ధర రూ.7.5 లక్షలు, ఎక్స్-షోరూమ్) కన్నా ఈ స్పెషల్ ఎడిషన్ బొలెరో ధర సుమారు రూ.50,000 వరకు అదనంగా ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, March 26, 2014, 10:02 [IST]
English summary
Mahindra has silently launched a limited production Special Edition Bolero SUV that is equipped with Anti-lock Braking System (ABS). This is the first time the aged SUV has come with this safety feature.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+