6 సీట్లతో మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101

By Ravi

భారత యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరియు ఈ కంపెనీ స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటో దిగ్గజం శాంగ్‌యాంగ్‌లు సంయుక్తంగా భారత మార్కెట్ కోసం కొత్త శ్రేణి ఉత్పత్తులను, ఇంజన్లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. మహీంద్రా శాంగ్‌యాంగ్ సంస్థలు ఇప్పటికే భారత మార్కెట్ కోసం ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీవి 'ఎస్101' (S101) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తోంది.

ఏ కాంపాక్ట్ కారులోనైనా ముందు వరుసలో రెండు సీట్లు (డ్రైవర్, ప్యాసింజర్) మాత్రమే ఉంటాయి. అయితే ఈ ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీలో మాత్రం ముందు వరుసలో మూడు సీట్లు, వెనుక వరుసలో మూడు సీట్లు ఉండనున్నాయి. సాధారణంగా ముందు వరుసలో ప్యాసింజర్, డ్రైవర్ సీట్లను వేరు చేస్తూ మధ్యలో గేర్‌బాక్స్ ఉంటుంది. కానీ ఎస్101లో మాత్రం ఈ గేర్‌బాక్స్ కారు డ్యాష్ బోర్డులోనే అమర్చారు. దీని ఫలితంగా ముందు వరుసలో 1 డ్రైవర్ సీట్, 2 ప్యాసిజర్ సీట్లను అమర్చడానికి స్థలం ఏర్పడుతుంది.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101 రహస్య చిత్రాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీని సరికొత్త మోనోకాక్ ఛాస్సిస్‌పై నిర్మించారు. ఇది నాలుగు మీటర్ల తక్కువ పొడవును కలిగి ఉండి, తక్కువ ఎక్సైజ్ సుంకం పరిధిలోకి వస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 3-సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించవచ్చని సమాచారం. దేశీయ విపణిలో దీని ధర రూ.5 లక్షల ఉండొచ్చని అంచనా. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్101


Image Source: Autocar Magazine

More from DriveSpark

Article Published On: Tuesday, May 21, 2013, 16:11 [IST]
English summary
Mahindra SsangYong is now working on a new compact SUV under the code name S101 to compete with models like Ford EcoSport, Renault Duster. The S101 will come with 6 seats, 3+3 seater option. Have a look at the spy images revealed by AutocarIndia.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+