ఎలక్ట్రిక్ కారుతో 'ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్'లోకి మహీంద్రా ఎంట్రీ
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా 2012 నుంచి ప్రారంభం కానున్న ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్‌లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సారిగా ఎలక్ట్రిక్ ఫార్ములా వన్ కార్లతో వచ్చే ఏడాది 'ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్' (Formula E Championship)ను నిర్వహించనున్న సంగతి తెలసినదే.
ఈ కార్లు చూడటానికి అచ్చం పెట్రోల్‌తో నడిచే ఫార్ములా వన్ కార్ల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ ఇవి పూర్తిగా బ్యాటరీ పవర్‌తోనే పనిచేస్తాయి. ఈ ఆల్ ఎలక్ట్రిక్ కార్ మోటార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్న 10 బృందాల్లో మహీంద్రా రేసింగ్ కూడా ఒకటి. మహీంద్రా ఫార్ములా ఈ బృందానికి మహీంద్రా రేసింగ్ చైర్మన్ ఎస్‌పి సుక్లా సారధ్యం వహించనున్నారు.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఈ 2014 ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ రేసింగ్ సీజన్ సెప్టెంబర్ 20, 2014న ప్రారంభమై జూన్ 2015 వరకు నడుస్తుంది. హాంగ్‌కాంగ్, బ్యూనస్ ఎయిరెస్, పుంటా డె ఈస్ట్, లాస్ ఏంజిల్స్, మియామి, పుట్రాజయ, మోంట్ కార్లో, బెర్లిన్ ప్రాంతాలలో ఈ రేస్ జరిగనుంది.

ప్రారంభం సీజన్‌లో భాగంగా అన్ని రేస్ కార్లు ఒకే తయారీకి చెందినవి ఉంటాయి. అంటే, అన్ని రేస్ కార్లు డిజైన్ పరంగా, యాంత్రికపరంగా ఒకే విధంగా ఉంటాయన్నమాట. ఇందులో ఛాసిస్ డల్లారా నుంచి, బ్యాటరీ మరియు పవర్‌ట్రైన్ విలియమ్స్ కంపెనీల నుంచి గ్రహిస్తారు. బాడీ డెవలప్‌మెంట్ మాత్రం స్పార్క్ రేసింగ్, రెనో సంస్థలు నిర్వహిస్తాయి. అయితే, 2014 తర్వాతి సీజన్ నుంచి మాత్రం ఎవరి రేసింగ్ కార్లను వారే తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేస్‌లో మొత్తం 10 బృందాలు పాల్గొననున్నాయి. ప్రతి బృందంలో ఇద్దరు డ్రైవర్లు (ఎఫ్1 మాదిరిగా) ఉండనున్నారు. గంట పాటు సాగే ఈ రేస్‌లో బ్యాటరీలు ఎక్కువ సేపు ఛార్జ్ ఉండవు కాబట్టి, మధ్యలో డ్రైవర్లు తమ కార్లను మార్చుకుంటుంటారు. ఫార్ములా ఈ రేసర్లు గరిష్టంగా గంటకు 217 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రిక్ రేస్ కార్లను నడపగలరు.

ప్రతి ఎలక్ట్రిక్ రేస్ కారు 25 నిమిషాల పాటు నడుస్తుంది. కానీ ప్రతి రేస్ దాదాపు గంటపాటు జరగాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి డ్రైవరుకు రేసుకు రెండు కార్ల చొప్పున ఇస్తారు. క్వాలిఫైయింగ్, రేస్ డే రెండింటినీ ఒకే రోజున నిర్వహిస్తారు. రెగ్యులర్ ఎఫ్1 రేసులను ప్రాక్టీస్ సెషన్. క్వాలిఫైయింగ్, రేస్ డే అని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.


Click it and Unblock the Notifications








