సరికొత్త స్కార్పియో కోసం మహీంద్రా జెన్యూన్ యాక్ససరీస్

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇటీవలే మార్కెట్లో విడుదల సరికొత్త 2014 స్కార్పియో ఎస్‌యూవీ కోసం కంపెనీ కొన్ని అదనపు యాక్ససరీలను ప్రకటించింది. కస్టమర్లు తమ ఎంపిక మేరకు ఈ యాక్ససరీలను ఎంచుకొని, తమ స్టన్నింగ్ మహీంద్రా స్కార్పియోని మరింత స్టయిలిష్‌గా మార్చుకోవచ్చు. మరి మహీంద్రా తమ స్కార్పియో కోసం ప్రకటించిన ఆ సరికొత్త అధనపు యాక్ససరీలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ఎక్స్టీరియర్ కోసం అదనపు యాక్ససరీలు:
* క్రోమ్ ప్యాకేజ్ (క్రోమ్ గ్రిల్ ఇన్‌సెర్ట్స్‌తో కలిపి)
* బానెట్ స్కూప్
* ఫాగ్‌ల్యాంప్ ఎన్‌క్లోజర్స్, డోర్ హ్యాండిల్స్, డి-పిల్లర్ ఎయిర్‌ఫ్లో వెంట్స్
* సైడ్ మిర్రర్ హౌసింగ్, రియర్ నెంబర్ ప్లేట్ అప్లిక్యూ, రియర్ బంపర్ రిఫ్లెక్టర్స్
* ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ గార్డ్స్, ర్యాలీ ఫాగ్‌ల్యాంప్స్ (ఫ్రంట్ బంపర్ గార్డుకు అమర్చబడి ఉంటాయి)
* రెండు రకాల (17-ఇంచ్, 15-ఇంచ్) అల్లాయ్ వీల్స్ డిజైన్, వీల్ కవర్స్
* స్కై ర్యాక్, రూఫ్ క్యారీయర్, ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్
* బాడీ కలర్డ్ రియర్ రూఫ్ స్పాయిల్ (బ్రేక్ లైట్‌తో)

mahindra scorpio

ఇంటీరియర్ కోసం అదనపు యాక్ససరీలు:
* కస్టమర్ల ఎంపిక మేరకు అందుబాటులో ఉండే డ్యూయెల్ టోన్ ప్లష్ సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్స్
* రియర్ సీట్ ప్యాసింజర్స్ కోసం రూఫ్ మౌంటెడ్ బ్లోయెర్
* వివిధ రకాల గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకునేందుకు కార్ ఇన్వెర్టర్
* చల్లటి పానీయాలను స్టోర్ చేసుకునేందుకు ఇన్-కార్ కూలర్
* 2 ఇన్ 1 కార్ చార్జర్, కోట్ హ్యాంగర్, కార్ కుషన్స్
* నెక్ రెస్ట్స్, బెల్ట్ ప్యాడ్ సెట్, బ్యాక్ సీట్ ఆర్గనైజర్
* కార్ ఫ్రాగ్రాన్స్ (కార్ పెర్ఫ్యూమ్), రిమోట్ లాక్
* వెనుక సీటులోని ప్రయాణీకుల వినోదం కోసం ఏర్పాటు చేసిన 9-ఇంచ్ హెడ్‌రెస్ట్ మౌంటబల్ మోనిటర్స్ (డివిడి ప్లేయర్ ఆప్షన్‌తో)
* 7-ఇంచన్ ఇన్‌బిల్ట్ మోనిటర్స్ (డివిడి ప్లేయర్ ఆప్షన్‌తో) (ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లలో అమర్చబడి ఉంటాయి)
* హోమ్ థియేటర్ సౌండ్ ఎఫెక్ట్ కోసం సెంట్రల్ ఊఫర్
* హెడ్స్ అప్ డిస్‌ప్లే
* వెనుక సీట్లలోని ప్రయాణీకుల వినోదం కోసం రూఫ్ మౌంటెడ్ ఎల్‌సిడి డివిడి ప్లేయర్

mahindra scorpio accessories

ఇక కొత్త 2014 మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే.. దీనిని సరికొత్త ఛాస్సిస్‌పై తయారు చేశారు. హైడ్రోఫార్మింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ ఛాస్సిస్‌ను తయారు చేశారు, ఫలితంగా ఇది మునుపటి వెర్షన్ ఛాస్సిస్ కన్నా ధృడంగా ఉంటుంది. ఈ కొత్త 2014 మహీంద్రా స్కార్పియో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.

ఇంజన్ విషయానికి వస్తే.. ఇది రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్, మరొకటి 2.5 లీటర్ ఎమ్ఐ2డిఐసిఆర్ డీజిల్ ఇంజన్. ఇందులోని 2.2 లీటర్, 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పిల శక్తిని, 1800-2800 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎస్4, ఎస్6, ఎస్6 ప్లస్, ఎస్8 మరియు ఎస్10 వేరియంట్లలో లభిస్తుంది.

new mahindra scorpio

ఇకపోతే బేస్ వేరియంట్ (ఎస్2) మహీంద్రా స్కార్పియోలో 2.5 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3200 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పిల శక్తిని, 1400-2200 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం ఎస్2 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. కంపెనీ ఈ గేర్‌బాక్స్ పనితీరును మరింత మెరుగు పరిచింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త స్కార్పియో లీటరు డీజిల్‌కు 15 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
Mahindra and Mahindra has announced genuine accessories for its recently launched all-new 2014 Scorpio SUV. Her's the list of accessories. Take a look.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X