ఆటో ఎక్స్‌పో: మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం మహీంద్రా రేవా, ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో ఓ సరికొత్త స్పోర్ట్స్ కార్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. 'మహీంద్రా హాలో' పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో 105 కి.వా. (140 బిహెచ్‌పి)ల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించనున్నారు.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సుమారు 140 బిహెచ్‍‌‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ మోటర్ ఓ హై కెపాసిటీ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది కేవలం 7 సెకండ్ల కన్నా తక్కువ వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందట. దీని గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. పైమాటే. మహీంద్రా హలో ఓ టూ-డోర్, టూ-సీటర్ స్పోర్ట్స్ కార్ కాన్సెప్ట్.

మహీంద్రా హలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ఇండియాతో పాటుగా విదేశీయ మార్కెట్లలో కూడా విక్రయించే ఆస్కారం ఉంది. ఈ మోడల్ ఉత్పత్తి 2015 మధ్య భాగం నాటికి కానీ లేదా 2016 తొలినాళ్లలో కానీ జరిగే అవకాశం ఉంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

మహీంద్రా హలో ఓ టూ-డోర్, టూ-సీటర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం మహీంద్రా రేవా ఈ హలో స్పోర్ట్స్ కారును అభివృద్ధి చేసింది.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

మహీంద్రా హలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్‌ను కలిగి ఉంటుంది.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉండే మహీంద్రా హలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ శక్తివంతమైన బ్యాటరీతో నడుస్తుంది.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, ఫ్లాట్ రేడియల్ టైర్స్‌ను మహీంద్రా హలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కాన్సెప్ట్‌లో చూడొచ్చు.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

మహీంద్రా హలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కాన్సెప్ట్ ఇంటీరియర్స్.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

మహీంద్రా హలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

మహీంద్రా హలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ స్టీరింగ్ వీల్.

మహీంద్రా హలో స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ

మహీంద్రా హలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కాన్సెప్ట్ రియర్ ఫ్రొఫైల్.

More from DriveSpark

Article Published On: Friday, February 7, 2014, 20:32 [IST]
English summary
Mahindra Reva, the electric mobility division of Mahindra and Mahindra, has unveiled the Mahindra Halo, a two-door, two-seater electric sports car concept at Auto Expo 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+