మహీంద్రా జైలో డి2 మ్యాక్స్ 9 సీటర్ వేరియంట్ విడుదల

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న బహుళ ప్రయోజన వాహనం (మల్టీ పర్సస్ వెహికల్) జైలో (Xylo)లో కంపెనీ ఓ సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 9 మంది ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) కూర్చొని ప్రయాణించేలా తయారు చేసిన 9-సీటర్ వెర్షన్ 'మహీంద్రా జైలో డి2 మ్యాక్స్' (Mahindra Xylo D2 MAXX)ను కంపెనీ విడుదల చేసింది.

మహీంద్రా జైలో డి2 మ్యాక్స్ ఎమ్‍‌పివి ధరను రూ.7.12 లక్షలు (బిఎస్‌3 వెర్షన్, ఎక్స్-షోరూమ్ ముంబై)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఈ 9-సీటర్ ఎమ్‌పిని ప్రధానంగా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్, ప్యాసింజర్ మూవ్‌మెంట్ కోసం అభివృద్ధి చేశామని, ఇందులో సైడ్ ఫేసింగ్ రియర్ సీట్స్ (వెనుక వరుసలో ఎదురెదురుగా ఉండే సీట్లు) ఉంటాయని కంపెనీ వివరించింది.

Mahindra Xylo D2 MAXX

మహీంద్రా జైలో డి2 మ్యాక్స్‌లో 2.5 లీటర్ ఎమ్‌డిఐ సిఆర్‌డిఈ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 95 పిఎస్‌ల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బిఎస్3, బిఎస్4 కాలుష్య నిబంధనలను పాటిస్తుంది. ఈ ఇంజన్ లీటరుకు గరిష్టంగా 14.95 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 16, 2013, 11:01 [IST]
English summary
Mahindra and Mahindra has launched the Xylo D2 MAXX with 9 seats option. This is the first time the Xylo, one of India’s most popular MPVs (multi-purpose vehicles) will be available with a 9 seats option, making it ideally suited for tour and travel operators, for passenger movement. Competitively priced at Rs. 7.12 lacs (BS3, ex-showroom Mumbai), this variant boasts side-facing rear seats.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+