క్వాంటో సీట్లను అప్‌గ్రేడ్ చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో' ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన సీట్లతో లభ్యం కానుంది. మహీంద్రా తమ క్వాంటోలోని సీట్లను మరింత ఫ్లెక్సిబల్‌గా ఉండేలా అప్‌గ్రేడ్ చేసింది. యోగా సీట్స్‌గా పిలిచే ఈ సీట్లను 36 విభిన్ని సీటింగ్ కాంబినేషన్లుగా మార్చుకోవచ్చు.

మహీంద్రా క్వాంటోలోని రెండవ వరుసలో ఉండే సీట్లు రిక్లైనింగ్ ఆప్షన్ (సీట్లను వెనక్కు నెట్టుకునే సదుపాయం), సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఫీచర్లతో లభిస్తాయి. రెండవ వరుస సీట్లలో ఏర్పాటు చేసిన ఈ రిక్లైనింగ్ ఆప్షన్ వలన వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికులు మరింత సౌకర్యంగా, తమ కాళ్లను ముందుకు చాపుకునేందుకు వీలుగా సీట్లను వెనుకకు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.


రెండవ వరుసలోని సీట్లను 60:40 నిష్పత్తిలో మడుచుకోవచ్చు. అంతేకాదు ఇవి డబుల్ డంప్ ఫోల్డింగ్ ఆప్షన్‌తో కూడా లభిస్తాయి. అంటే, వీటిని రెండు సార్లు మడిస్తే, పూర్తిగా మడుచుకొని ఎక్కువ లగేజ్ స్పేస్ లభిస్తుంది. ప్యాసింజర్ల సౌకర్యం కోసం ఈ సీట్లలో మెత్తని కుషన్‌ను అమర్చారు. కొత్త మహీంద్రా క్వాంటోలో సీట్స్ అప్‌గ్రేడ్ మినహా యాంత్రికపరమైన మార్పులేవీ లేవు.

మహీంద్రా క్వాంటో విషయానికి వస్తే, ఇందులో అమర్చిన శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది.

Mahindra Quanto

క్వాంటోలో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 22, 2014, 11:21 [IST]
English summary
Mahindra & Mahindra Ltd (M&M) has introduced flexible seating christened Yoga seats that are capable of allowing 36 different seating combinations in its SUV, the Quanto.With the new seating configuration, the second row of seats in the Quanto comes with a reclining option and a centrally placed armrest. This enables passengers to adjust the seat back for better seating comfort and better leg space.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+