ప్రెజర్ వాల్వ్స్ లోపం; మహీంద్రా స్కార్పియో రీకాల్
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయించిన పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియోలో ప్రెజర్ వాల్వ్స్ సమస్య కారణంగా వాటిని రీకాల్ చేస్తిన్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం 23,519 స్కార్పియో ఎస్‌యూవీలలో ఈ సమస్యను గుర్తించామని, కేవలం ఈఎక్స్ వేరియంట్‌లు మాత్రమే ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది.
మే 2012 నుంచి నవంబర్ 2013 మధ్య కాలంలో తయారైన మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలలో ప్రెజల్ వాల్వ్ సమస్య ఉందని, అదికూడా కేవలం ఈఎక్స్ వేరియంట్‌లోనే ఈ సమస్య ఉందని కంపెనీ వివరించింది. ఇతర వేరియంట్లలో ఈ సమస్య లేదని మహీంద్రా స్పష్టం చేసింది.

మహీంద్రా సర్వీస్ నిపుణులు ఈ రీకాల్‌కు వర్తించే వాహనాలను తనిఖీ చేసి, లోపపూరితమైన ప్రెజర్ వాల్వ్‌ను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. గతంలో కూడా ఇదే వేరియంట్ విషయంలో మహీంద్రా తమ స్కార్పియోలను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. అప్పట్లో అక్టోబర్-నవంబర్ 2013లో తయారైన 985 ఈఎక్స్ వేరియంట్ స్కార్పియోలను రీకాల్ చేశారు.


Click it and Unblock the Notifications








