రూ.5 లక్షలకే మహీంద్రా రేవా, బ్యాటరీ కోసం ఈఎమ్ఐ

By Ravi

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ 'మహీంద్రా రేవా' అందిస్తున్న ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ' వినియోగదారులకు చేరువ చేసేందుకు కంపెనీ మరో కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇదివరకు మహీంద్రా ఈ2ఓ కారును కొనుగోలు చేయాలంటే కస్టమర్లు సుమారు 7 లక్షలకు పైగా వెచ్చించాల్సి వచ్చేది.

అయితే, కస్టమర్లు ఇప్పుడు కేవలం రూ.4.99 లక్షలు (ఆన్-రోడ్, ఢిల్లీ) చెల్లించి మహీంద్రా ఈ2ఓ బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కానీ, ఈ ధరలో బ్యాటరీ వెల మాత్రం ఉండదు. బ్యాటరీ కోసం కంపెనీ ఐదేళ్ల పాటు సులభ వాయిదా పద్దతిని ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మహీంద్రా ఈ2ఓ

ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు కారు ధర (రూ.4.99 లక్షలు) కాకుండా నెలకు రూ.2,599ల చొప్పున బ్యాటరీ కోసం మహీంద్రా రేవాకు చెల్లించాల్సి ఉంటుంది.

మహీంద్రా ఈ2ఓ

ఇలా నెలకు రూ.2,599ల చొప్పున ఐదేళ్ల కాలం పాటు బ్యాటరీ కోసం చెల్లించే మొత్తం రూ.1,55,940లు.

మహీంద్రా ఈ2ఓ

కారు కోసం ఏక మొత్తంలో రూ.5 లక్షలు చెల్లించలేని కస్టమర్లు ఫైనాన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే, ఇలాంటి కస్టమర్లు తమ కార్ ఈఎమ్ఐతో పాటుగా బ్యాటరీ ఈఎమ్ఐని కూడా చెల్లించాల్సి ఉంటుంది.

మహీంద్రా ఈ2ఓ

కాగా.. బ్యాటరీ కోసం ఈ ఐదేళ్ల కాలం పూర్తయ్యే వరకు మహీంద్రా ఈ2ఓ బ్యాటరీపై పూర్తి హక్కులు మహీంద్రా రేవాకే ఉంటాయి.

మహీంద్రా ఈ2ఓ

అలాగే, ఈ ఐదేళ్ల కాలం పాటు బ్యాటరీ వారంటీ కవర్ అవుతుంది. ఈ సమయంలో బ్యాటరీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా కంపెనీ చూసుకుంటుంది.

మహీంద్రా ఈ2ఓ

బ్యాటరీ మెయింటినెన్స్, పెర్ఫార్మెన్స్, అప్‌గ్రడేషన్, రిపేర్స్ వంటివి ఈ ఐదేళ్ల కాలంలో కస్టమర్లకు ఉచితంగా లభిస్తాయి. ఈ సమయంలో కంపెనీ 24x7 అసిస్టెన్స్‌ను కూడా అందిస్తోంది.

మహీంద్రా ఈ2ఓ

బెంగుళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహీంద్రా రేవా తమ ఈ2ఓ ఆఫర్‌ను వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ తమ సరికొత్త క్విక్2చార్జ్ టెక్నాలజీ అయిన డిసి ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను కూడా ప్రదర్శనకు ఉంచింది.

మహీంద్రా ఈ2ఓ

అంతేకాకుండా, మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ ఓ టాప్-ఎండ్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రమే క్విక్2చార్జ్ టెక్నాలజీ డిసి ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను సపోర్ట్ చేస్తుంది.

మహీంద్రా ఈ2ఓ

క్విక్2చార్జ్ టెక్నాలజీ డిసి ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌తో చార్జ్ చేసుకునేందుకు టాప్ ఎండ్ వేరియంట్ మహీంద్రా ఈ2ఓ కారులో వెనుక వైపు మరో అదనపు చార్జింగ్ పోర్ట్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

మహీంద్రా ఈ2ఓ

క్విక్2చార్జ్ టెక్నాలజీ డిసి ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ సాయంతో ఒక గంట వ్యవధిలోనే ఈ2ఓ బ్యాటరీ పూర్తిగా 100 శాతం చార్జ్ అవుతుంది. 15 నిమిషాలు చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 18, 2014, 18:28 [IST]
English summary
Mahindra Reva e2o has just become a lot more affordable. India's only mainstream electric car, which previously cost nearly INR 7 lakhs at the very least, can now be yours for as low as INR 4.99 lakhs (On-road Delhi) for the base variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+