మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'మహీంద్రా స్కార్పియో'లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, మహీంద్రా తమ కొత్త 2014 స్కార్పియో ఎస్‌యూవీని ఈనెలలో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

సెప్టెంబర్ 25, 2014వ తేదీన ఈ సరికొత్త మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ విడుదల కానుంది. కొత్త స్కార్పియోకి సంబంధించి మహీంద్రా ఇప్పటికే ఓ టీజర్ ఫొటోను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా, మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్లు ఇప్పటి నుంచి ఈ కొత్త 2014 స్కార్పియో ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరించడం ప్రారంభించారు.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ బేసిక్ డిజైన్‌ను యధావిధిగా ఉంచుతూనే, ఫ్రంట్ డిజైన్, రియర్ డిజైన్ మరియు ఇంటీరియర్లలో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఫీచర్లలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. కొత్త హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ బంపర్స్, రీస్టయిల్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త రియర్ బంపర్ అండ్ టెయిల్ గేట్ వంటి మార్పులను మనం 2014 స్కార్పియోలో గమనించవచ్చు.

Mahindra Scorpio Facelift Bookings Open

క్యాబిన్ లోపల రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, అప్‌మార్కెట్ ఫీల్‌నిచ్చే ఇంటీరియర్స్, కొత్త సెంటర్ కన్సోల్, కొత్త స్టీరింగ్ వీల్ వంటి మార్పులు ఇందులో ఉండే అవకాశం ఉంది. మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 నుంచి స్ఫూర్తి పొంది దీని ఇంటీరియర్స్‌ను డిజైన్ చేయవచ్చని సమాచారం. ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త 2014 మహీంద్రా స్కార్పియోకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 16, 2014, 17:11 [IST]
English summary
Country's largest utility vehicle manufacturer Mahindra to launch the new Scorpio on September 25, 2014. Mahindra has officially opened bookings of its new Scorpio facelift.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+