ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ ఫీచర్లో మహీంద్రా స్కార్పియో ఎస్4 ప్లస్

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) గడచిన సెప్టెంబర్ నెలలో మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మహీంద్రా స్కార్పియోలో కంపెనీ తాజాగా మరో కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో లభ్యమవుతున్న స్కార్పియో, ఇకపై ఎస్4+ అనే కొత్త వేరియంట్‌లో కూడా లభ్యం కానుంది.

మహీంద్రా స్కార్పియో ఎస్4+ వేరియంట్‌లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, సీట్‌బెల్ట్ రిమైండర్ వార్నింగ్, పానిక్ బ్రేక్ ఇండికేషన్ మరియు ఫాలో మి హోమ్ హెడ్‌ల్యాంప్స్ వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

Mahindra Scorpio S4 Plus

ఇది వరకు మహీంద్రా స్కార్పియో ఎస్4 వేరియంట్ షిఫ్ట్ ఆన్ ఫ్లై ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమయ్యేది. కాగా.. ఇప్పుడు స్కార్పియో ఎస్4+ వేరియంట్ మాత్రమే ఈ ఆప్షన్‌‌తో లభ్యం కానుంది. ఇకపై స్కార్పియో ఎస్4 వేరియంట్ టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

ఇంజన్ విషయానికి వస్తే.. ఎస్4, ఎస్6, ఎస్6 ప్లస్, ఎస్8 మరియు ఎస్10 వేరియంట్లలో ఉపయోగిస్తున్న 2.2 లీటర్, 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌నే ఈ కొత్త ఎస్4+ వేరియంట్‌లోను ఆఫర్ చేయనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పిల శక్తిని, 1800-2800 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 9, 2015, 14:45 [IST]
English summary
Country's largest utility vehicle manufacturer Mahindra has introduced a new variant of the new Scorpio called the Scorpio S4+. The new Mahindra Scorpio S4+ variant gets dual front airbags, ABS with EBD, seatbelt-reminder warning, panic brake indication and follow-me-home headlamps as standard.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+