స్పెషల్ ఎడిషన్ మహీంద్రా స్కార్పియో రూ.11.88 లక్షలు

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మహీంద్రా స్కార్పియోను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటికథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మహీంద్రా అండ్ మహీంద్రా నేడు (అక్టోబర్ 9, 2013) మరిన్ని అధనపు ఫీచర్లతో కూడిన తమ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ స్కార్పియోను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

దేశీయ విపణిలో ఈ మహీంద్రా స్కార్పియో స్పెషల్ ఎడిషన్ ధరను రూ.11.88 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెరల్ వైట్ కలర్‌లో లభించే ఈ స్పెషల్ ఎడిషన్ మహీంద్రా స్కార్పియోలో లభ్యం కానున్న ఫీచర్లు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • స్పెషల్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్
  • క్రోమ్ ప్లేటెడ్ అల్లాయ్ వీల్స్
  • స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్
  • యూరోపియన్ లగ్జరీ లెథర్ ఇంటీరియర్స్
  • లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్
  • గ్లోజీ ఫినిష్‌తో కూడిన ఉడెన్ సెంటర్ కన్సోల్
  • డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
  • రూఫ్ మౌంటెడ్ డివిడి ప్లేయర్, 9 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్
    Mahindra Scorpio

    ఇంజన్ పరంగా స్పెషల్ ఎడిషన్ మహీంద్రా స్కార్పియోలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 120 పిఎస్‌ల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.
Article Published On: Wednesday, October 9, 2013, 13:33 [IST]
English summary
Country's largest utility vehicle manufacturer Mahindra and Mahindra has launched a new special edition Scorpio SUV. Mahindra Scorpio Special Edition is priced at Rs 11.88 lakhs (ex-showroom).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+