2014లో మహీంద్రా టూవీలర్స్ నుంచి మూడు కొత్త మోడళ్లు
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ ఈ ఏడాదిలో మూడు కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయనుంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో మహీంద్రా టూవీలర్స్ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునే దిశలో భాగంగా 9 కొత్త మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇందులో భాగంగానే, ఈ ఏడాది 3 కొత్త మోడళ్లు విపణిలో విడుదల కానున్నాయి.
వాస్తవానికి మహీంద్రా గ్రూపుకు ఎస్‌యూవీల విభాగం తెచ్చినంత సక్సెస్‌ను టూవీలర్స్ విభాగం తెచ్చిపెట్టలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణంగా, ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో సరైన ఉత్పత్తులు లేకపోవటమే. మహీంద్రా టూవీలర్స్ 2013వ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల నష్టాలను చవిచూసింది. అయితే, కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన సెంచురో 110సీసీ మోటార్‌సైకిల్ మంచి సక్సెస్‌ను సాధించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలు రూ.200 కోట్లకు పడిపోయే ఆస్కారం ఉంది.

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో స్కూటర్ సెగ్మెంట్ కూడా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, కంపెనీ సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ కొత్త ఉత్పత్తుల విడుదలతో ప్రతినెలా సగటున 25,000 యూనిట్ల నుంచి 30,000 యూనిట్ల అమ్మకాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు గోయెంకా తెలిపారు.


Click it and Unblock the Notifications








