టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

By Ravi

ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) దేశీయ విపణిలో అందిస్తున్న ఏకైక సెడాన్ 'మహీంద్రా వెరిటో' ప్లాట్‌ఫామ్‌‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇప్పటికే పలు కథనాల్లో చదువుకున్నాం. ఈ కథనాలను నిజం చేస్తూ.. తెలుగు డ్రైవ్ స్పార్క్ మొట్టమొదటి సారిగా ఈ మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్ రహస్య చిత్రాలను (స్పై షాట్స్) మీ ముందుకు తీసుకువస్తోంది. ఎమ్ అండ్ ఎమ్ ఇప్పటికే ఈ హ్యాచ్‌బ్యాక్‌ను భారతీయ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది.

మార్కెట్ సమాచారం ప్రకారం, మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్ టెస్టింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చ్ నెల నాటికి ఈ కాంపాక్ట్ కారు దేశీయ విపణిలో విడుదల కావచ్చని సమాచారం. ఇది కంపెనీ ఇటీవల విడుదల చేసిన సరికొత్త 2012 మహీంద్రా వెరిటో సెడాన్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంది కాబట్టి, దీని ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో సెడాన్ వెర్షన్‌లో అనేక ఫీచర్లు కామన్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ రహస్య చిత్రాల్లో మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ ప్రొఫైల్ గమనిస్తే, అది సెడాన్ వెర్షన్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది. ఇదే ఇంటీరియర్లలో కూడా అనేక ఫీచర్లు ఒకేలా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో


చిన్న కార్లపై (4 మీటర్ల కన్నా పొడవు తక్కువ కలిగి ఉండే కార్లు) ప్రభుత్వం ఎక్సైజ్ రాయితీలను అందిస్తున్న నేపథ్యంలో, ఈ రాయితీలను పొందటం ద్వారా తక్కువ ధరకే ఈ కాంపాక్ట్ కారును అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్ అండ్ ఎమ్, ఈ వెరిటో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా నాలుగు మీటర్ల కన్నా పొడవు తక్కువగా ఉండేలా అభివృద్ధి చేసింది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వెరిటో సెడాన్‌లో ఉపయోగించిన ఇంజన్లనే హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ వెరిటోలను ఉపయోగించనున్నారు. ఇది కూడా సెడాన్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

పెట్రోల్ వెర్షన్‌ వెరిటోలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 75 హెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ వెరిటోలో ఉపయోగించిన 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 65 హెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కాంపాక్ట్ కారు ధర వెరిటో సెడాన్ ధర కన్నా తక్కువగా ఉండనుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో మహీంద్రా వెరిటో సెడాన్ ధరలు రూ.5.2 లక్షల నుంచి రూ.7.1 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
Spy Images Source:

More from DriveSpark

Article Published On: Friday, January 11, 2013, 17:20 [IST]
English summary
As we reported earlier, India's leading SUV manufacturer Mahindra and Mahindra (M and M) is planing to launch its compact car (a sub-four-metre version of the Verito sedan) in Indian market by March 2013. Now company has started testing the new compact Verito hatchback on Indian roads. Have a look the spy shots of Verito hatchback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+