మహీంద్రా వెరిటో వైబ్ బూట్ స్పేస్ కంపారిజన్
ప్రముఖ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా చిన్ని కార్ల సెగ్మెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'మహీంద్రా వెరిటో వైబ్' కాంపాక్ట్ కారుతో లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చింది. నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు (3991 మి.మీ.) పొడవు ఉండేలా, ఈ చిన్న కారును తయారు చేసి, చిన్న కార్లపై భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ సుంకపు రాయితీలను పొందాలని కంపెనీ వెరిటో వైబ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
బూట్ స్పేస్‌ను తగ్గించడంతో ఈ కారు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గింది. అందుకే కంపెనీ ఈ కారును రూ.5.63 లక్షల ప్రారంభ ధరకే అందిస్తుంది. వెరిటో సెడాన్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కాంపాక్ట్ కారు ధర సుమారు రూ.50,000 తక్కువగా ఉంటుంది. బూట్ స్పేస్‌ను భారీగా తగ్గించడంతో వెరిటో వైబ్‌ను వెనుక నుంచి చూస్తే కాస్తం ఎబ్బెట్టుగానే కనిపిస్తుందని చెప్పాలి. కానీ, ఇదే సెగ్మెంట్లో లభిస్తున్న స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి కార్లు మాత్రం వెనుక వైపు నుంచి మంచి లుక్‌ని కలిగి ఉన్నాయి.
అయితే, తమ వెరిటో వైబ్ ఇటు హ్యాచ్‌బ్యాక్ లేదా కాంపాక్ట్ సెడాన్ కాదని, ఇది కేవలం కాంపాక్ట్ కారు మాత్రమేనని మహీంద్రా పేర్కొంది. మరి ఈ సెగ్మంట్లో అందుబాటులో ఉన్న చిన్న కార్ల బూట్ స్పేస్‌ను మహీంద్రా వెరిటో వైబ్ బూట్ స్పేస్‌తో ఓసారి పోల్చిచూద్దాం రండి..!

బూట్ స్పేస్ - 330 లీటర్లు
బేస్ డీజిల్ వేరియంట్ ధర రూ.5.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)

బూట్ స్పేస్ - 400 లీటర్లు
బేస్ డీజిల్ వేరియంట్ ధర రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)

బూట్ స్పేస్ - 315 లీటర్లు
బేస్ డీజిల్ వేరియంట్ ధర రూ.6.4 లక్షలు (ఎక్స్-షోరూమ్)

బూట్ స్పేస్ - 204 లీటర్లు
బేస్ డీజిల్ వేరియంట్ ధర రూ.5.7 లక్షలు (ఎక్స్-షోరూమ్)

బూట్ స్పేస్ - 295 లీటర్లు
బేస్ డీజిల్ వేరియంట్ ధర రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)

బూట్ స్పేస్ - 280 లీటర్లు
బేస్ డీజిల్ వేరియంట్ ధర రూ.6.11 లక్షలు (ఎక్స్-షోరూమ్)


Click it and Unblock the Notifications








