జూన్ 5న మార్కెట్లోకి రానున్న మహీంద్రా వెరిటో వైబ్

By Ravi

మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న 'వెరిటో' సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ కారు (సబ్-ఫోర్ మీటర్ కారు) 'వెరిటో వైబ్' (Verito Vibe)ను వచ్చే నెల 5వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. చిన్న కార్లపై (నాలుగు మీటర్ల కన్నా పొడవు తక్కువగా ఉండే కార్లపై) భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు గాను మహీంద్రా వెరిటో వైబ్‌ను రూపొందించింది.

అంతేకాకుండా, ప్రస్తుతం భారత మార్కెట్లో చిన్నకార్లకు మంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సిద్ధమయింది. ఇందులో 1.5 లీటర్ డిసిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. రెనో సంస్థ నుంచి గ్రహించిన ఈ ఇంజన్ సగటును లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేయనుంది. ఇందులో పెట్రోల్ వెర్షన్ అందుబాటు గురించి ఇంత వరకూ ఎలాంటి సమాచారం లేదు.

మహీంద్రా వెరిటో వైబ్ పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ మెరుగైన స్థలం మరియు సౌకర్యాన్ని ఇది ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సరికొత్త వెరిటో వైబ్‌లో ఫస్ట్ ఇన్ క్లాస్ స్టయిలింగ్ ఫీచర్లను చూడొచ్చని కంపెనీ పేర్కొంది. మహీంద్రా వెరిటో వైబ్ జూన్ 5, 2013న మార్కెట్లోకి రానుంది. ఈ హ్యాచ్‌బ్యాక్/కాంపాక్ట్ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌ను గమనిస్తూనే ఉండండి..!

Mahindra Verito Vibe

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2013, 12:01 [IST]
English summary
Mahindra has announced that the Verito Vibe sub 4 meter vehicle will be launched on June 5th. Images of the Verito Vibe were leaked several times in the past month and hence we know the Vibe is a compact version of the Verito sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+