ఆటో ఎక్స్‌పో 2014: మహీంద్రా ఎక్స్‌యూవీ500 హైబ్రిడ్ వెర్షన్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500'లో కంపెనీ ఓ హైబ్రిడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇటు డీజిల్ పవర్‌తో పాటుగా అటు బ్యాటరీ పవర్‌తోను నడిచే సరికొత్త ఎక్స్‌యూవీ500 మోడల్‌ను, ప్రస్తుతం ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ఆవిష్కరించింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 హైబ్రిడ్ వేరియంట్‌తో పాటుగా కంపెనీ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా క్వాంటోలో ఓ ఆటోమేటిక్ వేరింట్‌ను కూడా ప్రదర్శనకు ఉంచింది (మహీంద్రా క్వాంటో ఇప్పటి వరకు కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభ్యమవుతూ ఉండేది). ఈ రెండు మోడళ్లతో పాటుగా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ ఫార్ములా ఈ కారును కూడా ఆవిష్కరించింది.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 హైబ్రిడ్ వెర్షన్‌కు రెగ్యులర్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ వ్యత్యాసాన్ని చూపేలా దీని ఫ్రంట్ డిజైన్ మరియు బాడీ పెయింట్‌ను మార్చారు.

ఇంజన్ కంపార్ట్‌మెంట్ బయటకి కనిపించేలా దీని బానెట్‌ను ట్రాన్స్‌పరెంట్ ఆక్రిలిక్ బాడీతో తయారు చేశారు.

రెగ్యులర్ డీజిల్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500తో పోల్చుకుంటే, ఈ హైబ్రిడ్ వెర్షన్ 18 శాతం అధిక మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 హైబ్రిడ్ వెర్షన్‌తో పాటుగా కంపెనీ క్వాంటో ఆటోమేటిక్ వెర్షన్ క్వాంటోను కూడా విడుదల చేసింది.

త్వరలోనే మహీంద్రా క్వాంటో ఏటి వేరియంట్ మార్కెట్లోకి రానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 హైబ్రిడ్ వెర్షన్ మరియు క్వాంటో ఆటోమేటిక్ వేరియంట్లతో పాటుగా కంపెనీ తమ ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ రేస్ కారును కూడా ఆవిష్కరించింది. ఇదే కారుతో కంపెనీ ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ రేస్ కార్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది.


Click it and Unblock the Notifications








