మహీంద్రా ఎక్స్‌యూవీ500 లిమిటెడ్ ఎడిషన్ వస్తుందట!

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే, మహీంద్రా అందిస్తున్న ఈ గ్లోబల్ ఎస్‌యూవీలో ఇదే తొలి స్పెషల్ ఎడిషన్ కానుంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యూవీ500లో కొన్ని చెప్పుకోదగిన కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొన్ని అదనపు ఎక్విప్‌మెంట్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. కానీ మెకానికల్‌గా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు.

Mahindra XUV500

ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ సైడ్స్‌పై 'Sportz' అనే బాడీ డెకాల్స్ ఉండనున్నాయి. ఇంకా ఎస్‌యూవీ పైభాగం, బానెట్ మరియు సైడ్ మిర్రర్స్‌పై కూడా స్పెషల్ బాడీ గ్రాఫిక్స్ ఉంటాయి. వైట్ ఎక్స్టీరియర్ బ్లాక్ ఇంటీరియర్ వంటి కలర్ కాంబినేషన్లతో ఇది లభ్యం కానుంది.

రెగ్యులర్ వైట్ ఎక్స్‌యూవీ500 మాత్రం బీజ్ కలర్ ఇంటీరియర్లతో లభిస్తోంది. ఈ కారులో రివర్స్ కెమెరా, రీడిజైన్డ్ ఆర్మ్‌రెస్ట్ వంటి మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 22, 2014, 13:20 [IST]
English summary
Mahindra is rumoured to be readying a limited edition version of its flagship SUV, the XUV500. If true, this would be the first time the company would be offering a special version of its ‘global SUV'.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+